బాలీవుడ్ కు బన్నీ ?
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కబీర్ ఖాన్ తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్ 83 పేరుతో తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కపిల్ పాత్రలో బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ నటిస్తుండడంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. తాజాగా ఈ చిత్రం గురించి ఓ ఆసక్తికరమైన వార్త తెలిసింది. ఈ సినిమాలో కలిల్తో పాటు మరో కీలక పాత్ర కూడా ఉందని ఈ పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బన్నీ కూడా ఇంతకు ముందు ఎప్పుడూ బాలీవుడ్ చిత్రాల్లో నటించలేదు. దాంతో ఈ చిత్రంలో బన్నీ నటిస్తున్నాడని వార్తలు రావడంతో అభిమానుల్లో కూడా ఈ చిత్రంపై ఆసక్తి పెరిగింది. మరి బన్నీ ఈ చిత్రంలో నటిస్తే మాత్రం కపిల్ దేవ్ బయోపిక్ 83కి తెలుగులో కూడా మంచి మర్కెట్ దొరికినట్లే.













