నెపోటిజంపై స్పందించిన అల్లు అరవింద్…
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ ఆహా ఓటీటీ లో దూసుకుపోతుంది. ఫస్ట్ సీజన్ హిట్ కావడంతో ఆహా టీం రీసెంట్ గా సీజన్ 2 ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సీజన్ 1 కి భిన్నంగా సీజన్ 2 ని ప్లాన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
సీజన్ 2 లో ఇప్పటివరకు నాలుగు ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవ్వడం, అవి బ్లాక్ బస్టర్ టాక్ సాధించిన విషయం తెలిసిందే. కొత్త ఎపిసోడ్ కోసం స్టార్ ప్రొడ్యూసర్స్ , వెటరన్ డైరెక్టర్స్ ని ఈ షోకి ఇన్వైట్ చేసినట్టు సమాచారం. అల్లు అరవింద్, డి. సురేష్ బాబు, కోదండరామిరెడ్డి, రాఘవేంద్ర రావు ఈ ఎపిసోడ్ లో సందడి చేయనున్నారు.
ఈ నలుగురు లెజెండరీ పర్సనాలిటీస్ పాల్గొన్న ఈ ఎపిసోడ్ ని డిసెంబర్ 2 న ఆహాలో స్ట్రీమింగ్ చేయడం మొదలు పెట్టారు. అంతకుముందే రిలీజ్ చేసిన ప్రోమో వైరల్ అవ్వడంతో, ఈ ఎపిసోడ్ ఎలా ఉంటుందా ? అని అంతా ఎదురు చూస్తున్నారు.
శుక్రవారం నుండి ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న తాజా ఎపిసోడ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎపిసోడ్ లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలనే కాకుండా, వివాదస్పదమైన విషయాలని కూడా టచ్ చేసారు.
ఇండస్ట్రీ లో కొన్నేళ్ల నుండి నెపోటిజంపై చర్చ జరుగుతుంది. .ఇప్పటివరకు కూడా ఆ చర్చ ఒక కొలిక్కి రాలేదని చెప్పొచ్చు. నెట్టింట్లో దీనిపై ఓ రేంజ్ లో ” అలా వైకుంఠపురం లో ” టైం లో ట్రోలింగ్ జరిగింది అనే విషయం అందరికి తెలిసిందే. దీనిపై ఈ షో లో స్పందించిన బాలయ్య నేను కూడా నెపో అని అన్నారు.
నెపోటిజంపై మీ అభిప్రాయం ఏంటి అని అల్లు అరవింద్ ని ప్రశ్నించగా , దానికి సమాధానమిస్తూ అల్లు అరవింద్ షాకింగ్ కామెంట్స్ చేసారు. నేను పూర్తిగా నెపోటిజంలో మునిగిపోయి ఉన్నాను. దీనిపై నన్ను చాలా మంది ట్రోల్ చేస్తారు, ట్రోల్ చేసేవారిని నేను అడుగుతున్నా మీ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పండి …
మీ కుటుంబంలో ఒకే పని చేసేవారు లేరా? మీ ఫ్యామిలీ వారసత్వాన్ని మీరు కొనసాగించరా? అసలు మా ఫ్యామిలీ తో నాకు సంబంధం లేదు అనుకునేవాళ్లు నన్ను ట్రోల్ చేయండని అరవింద్ అన్నారు. నా ఫ్రెండ్ ఒకరు లాయర్ , అతని పేరెంట్స్ కూడా లాయర్స్ …అది నెపోటిజం కాదా ? అని ప్రశ్నించారు.
మనం పెరిగే పరిసరాలను బట్టి ఫ్యూచర్ లో మనం ఏమవ్వాలో నిర్ణయించుకుంటాం. సినిమాల్లో ఉన్నవాళ్లు సినిమాల్లోనే రాణించాలి అనుకుంటారు. డాక్టర్స్, లాయర్స్ ఇలా అన్ని వృత్తులలో నెపోటిజం ఉంది . కానీ, సినిమా వాళ్ళని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారో అర్దమవ్వట్లేదని అన్నారు.













