రణ్‌బీర్ లైనప్ పైనే అందరి దృష్టి
యానిమల్(animal) సినిమాతో భారీ బ్లాక్‌బస్టర్ అందుకున్న తర్వాత రణబీర్ కపూర్(ranbir kapoor) కెరీర్ పూర్తిగా కొత్త దశలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం బాలీవుడ్లో అత్యంత భారీ బడ్జెట్, అత్యధిక అంచనాలు ఉన్న ప్రాజెక్ట్‌లలో ఆయన పేరు వరుసగా వినిపిస్తుండటం విశేషం. ముఖ్యంగా రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయణ(ramayana)లో కీలక పాత్ర పోషిస్తుండటంతో ఈ సినిమా ఆయన కెరీర్లో అత్యంత ప్రతిష్ఠాత్మక సినిమాగా మారింది. అదే సమయంలో డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ(sanjay leela bhansali) రూపొందిస్తున్న లవ్ అండ్ వార్(Love and war) కూడా ఇండస్ట్రీ వర్గాల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. విభిన్న కథలు, భారీ స్థాయి నిర్మాణాలతో రూపొందుతున్న ఈ రెండు సినిమాలు రణబీర్ ను నటుడిగా మరో మెట్టు ఎక్కించే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇప్పటికే సెన్సేషనల్ సక్సెస్ నుఅందుకున్న యానిమల్ కు సీక్వెల్ గా రానున్న యానిమల్ పార్క్(Animal park)పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తొలి భాగం సృష్టించిన ప్రభావం దృష్ట్యా సీక్వెల్‌పై అభిమానులు ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. ఈ ప్రాజెక్ట్‌తో పాటు యాక్షన్, కమర్షియల్ అంశాలకు పెద్దపీట వేసే మరో ఫ్రాంచైజీ సినిమాల డిస్కషన్స్ లో కూడా రణబీర్ పేరు వినిపిస్తుండటం ఆయన మార్కెట్ స్థాయిని మరింత స్పష్టం చేస్తోంది.
అదే సమయంలో ధూమ్4(Dhoom4), బ్రహ్మాస్త్ర2(Brahmastra2) వంటి ప్రముఖ ఫ్రాంచైజీల్లో రణబీర్ నటించే అవకాశాలపై బాలీవుడ్లో చర్చ కొనసాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌లపై అఫీషియల్ అనౌన్స్మెంట్స్ రావాల్సి ఉన్నప్పటికీ, ఆయన ఫ్యూచర్ లైనప్ పై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. ఇప్పటికే స్టార్ హీరోగా తన స్థానాన్ని బలపరుచుకున్న రణబీర్, రాబోయే సంవత్సరాల్లో వరుస భారీ సినిమాలతో బాలీవుడ్లో అత్యంత బిజీ నటుల్లో ఒకరిగా నిలిచే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లు ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకుంటే, ఆయన కెరీర్ మరో స్థాయికి చేరడం ఖాయమనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.








