ఎన్టీఆర్-నీల్ సినిమాకు బాలీవుడ్ హీరోయిన్ ?
ప్రస్తుతం ఎన్టీఆర్ ఓ పక్క దేవర సినిమాను పూర్తి చేస్తూనే మరోవైపు హృతిక్ రోషన్ తో కలిసి వార్2 సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు సెట్స్ పై ఉండగానే తారక్ తన తర్వాతి సినిమాను ప్రశాంత్ నీల్ తో మొదలుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కనున్న సినిమా ఆగస్ట్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు.
రీసెంట్ గా ప్రశాంత్ నీల్ స్క్రిప్ట్ వర్క్ ను కూడా పూర్తి చేశాడని వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉంటే డ్రాగన్ సినిమా గురించి ఇటీవల్ ఎన్నో పుకార్లు వినిపస్తున్నాయి. తాజాగా ఈ సినిమా కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ను నిర్మాణ సంస్థకు సంబంధించిన వారు ముంబై వెళ్లి సంప్రదించారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆలియా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ప్రశాంత్ నీల్ కథ నెరేట్ చేసే ఛాన్సున్న్లు తెలుస్తోంది. మొత్తానికి ఆలియాను మరోసారి టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతన్నాయన్నమాట. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ కు జోడీగా నటించిన ఆలియా పాత్రకు అందులో పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడంతో ఆ చిత్ర మేకర్స్ పై ఆలియా అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేసిందని వార్తలొచ్చాయి. మరి ఇప్పుడు ఎన్టీఆర్- నీల్ కాంబోలో వచ్చే డ్రాగన్ లో ఆలియాకు ఎలాంటి పాత్ర దక్కుతుందో చూడాలి.













