వీడు ఫొటో తీస్తే పెళ్లయి పోద్ది
అలీ హీరోగా నటించిన చిత్రం పండుగాడి ఫొటో స్టూడియో. వీడు ఫోటో తీస్తే పెళ్లయి పోద్ది అన్నది ఉపశీర్షిక. రిషిత కథానాయిక. సందీప్ రాజా, టీనాచౌదరి ఇతర నటీనటులు. దిలీప్ రాజా దర్శకత్వంలో గుదిబండి వెంకట సాంబిరెడ్డి నిర్మించారు. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు మాట్లాడుతూ దర్శకుడు సుకుమార్ ఓకే చేసిన కథ ఇది. 40 ఏళ్లు వచ్చినా హీరోకి ఎందుకు పెళ్లి కావడం లేదు అన్నది సినిమా ఇతివృత్తం. దీనికి కారణం నాగదేవత శాపమా? కుర్రాడి జాతకమా అన్నది హాస్య భరితంగా తెరకెక్కించాం. జూన్ నెలలో సినిమా విడుదల చేస్తాం అని అన్నారు. కెమెరా: మురళీమోహన్ రెడ్డి, సంగీతం: యాజమాన్య, ఎడిటర్: నందమూరి హరి.













