Akhil6: ఈ ఇయర్ లోనే ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇవ్వనున్న అఖిల్
ఏజెంట్(Agent) తర్వాత అఖిల్ అక్కినేని(akhil akkineni) ఇప్పటివరకు మరో సినిమాను మొదలుపెట్టింది లేదు. దీంతో అఖిల్ ఎప్పుడెప్పుడు కొత్త మూవీ స్టార్ట్ చేస్తాడా అని అంతా ఆశగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో మార్చి 14 నుంచి అఖిల్ తన కొత్త సినిమా సెట్స్ లో జాయిన్ కాబోతున్నాడని తెలిసింది. ఎన్నో కథలు విన్న అఖిల్ మురళీ కిషోర్ అబ్బూరు(murali kishore abburu) చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ మూవీకి లెనిన్(lenin) అనే టైటిల్ ను పరిశీలిస్తుందట చిత్ర బృందం. ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ గురించి ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఏకంగా 20 రోజుల పాటూ ఎలాంటి బ్రేకుల్లేకుండా కొనసాగించి దాదాపు 50% షూటింగ్ ను పూర్తి చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసిందట.
విదేశాలకు వెళ్లకుండా సినిమాలోని అధిక భాగం షూటింగ్ తెలుగు రాష్ట్రాల్లోనే చేయాలని డిసైడయ్యారట అఖిల్6 టీమ్. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ మూవీని దసరాకు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ లవ్ స్టోరీలో శ్రీలీల(sree leela) హీరోయిన్ గా నటిస్తుంది. ఒకవేళ దసరాకు పోటీ ఎక్కువ ఉందని తప్పుకున్నా మూవీని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసి ఫ్యాన్స్ కు సర్ప్రైజ్ ఇవ్వాలని చూస్తున్నాడట అఖిల్.













