అఖిల్ నెక్ట్స్ ఏంటి?
ఈ ఏడాది ఏజెంట్ సినిమాతో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్నాడు అఖిల్ అక్కినేని. ఏజెంట్ కోసం అఖిల్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. అదంత బూడిదలో పోసిన పన్నీరులా అయింది. ఈ మూవీతో నిర్మాత కూడా బాగా నష్టపోయాడు. కానీ డైరెక్టర్ సురేందర్ రెడ్డి మాత్రం దాని ఎఫెక్ట్ పెద్దగా పడకుండా, పవన్ తో సినిమాను సెట్ చేసుకున్నాడు. మొన్నటి వరకు ఏజెంట్ రిజల్ట్ తో బాధ పడిన అఖిల్ ఇప్పుడిప్పుడే ఆ బాధను మర్చిపోతున్నట్లు కనిపిస్తుంది. ఇదిలా ఉంటే అఖిల్ తన తర్వాతి సినిమాను కూడా భారీ బడ్జెట్లోనే తీస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ స్టోరీ ఉంటుందని తెలుస్తోంది. సాహోకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన అనిల్, అఖిల్ సినిమాతో డైరెక్టర్గా పరిచయం కాబోతున్నాడు.
దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం. అయితే ఈ మూవీ కంటే ముందు అఖిల్ ఒక చిన్న బడ్జెట్ సినిమా చేసే ఛాన్సుందని వార్తలొస్తున్నాయి. కానీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి క్లారిటీ అటు అఖిల్ నుంచి కానీ, ఇటు అఖిల్ సన్నిహితుల నుంచి కానీ లేదు. మరోవైపు లింగుస్వామితో సినిమా కోసం డిస్కషన్స్ జరుగుతున్నాయన్నారు కానీ అవేమీ నిజం కాదని చెప్పారు. రీసెంట్గా శ్రీకాంత్ అడ్డాల పేరు కూడా ఈ లిస్ట్ లో వినిపించింది. కానీ అఖిల్ మాత్రం తన నెక్ట్స్ ప్రాజెక్ట్ యూవీతోనే చేయనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఏదైనా తన తర్వాతి సినిమా విషయంలో అఖిల్ క్లారిటీ ఇవ్వడం బెటర్.













