సీనియర్ల జోలికి వెళ్లకూడదనుకుంటున్న అఖిల్
అఖిల్ అక్కినేని ఇండస్ట్రీకి వచ్చి ఏడేళ్లయింది కానీ ఇప్పటికీ సరైన సాలిడ్ హిట్ అయితే అందుకోలేకపోయాడు. తన కెరీర్లో ఇప్పటివరకు ఓ మోస్తరు హిట్ అందుకుంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతోనే. అది కూడా బ్లాక్ బస్టర్ అని చెప్పలేం కానీ అఖిల్ తీసిన అన్ని సినిమాలతో పోలిస్తే ఇది మంచి సినిమా అనుకోవడమే.
అఖిల్ ఇప్పటి వరకు వర్క్ చేసింది సీనియర్ డైరెక్టర్లతోనే. వినాయక్, విక్రమ్ కె. కుమార్, వెంకీ అట్లూరి, బొమ్మరిల్లు భాస్కర్, సురేందర్ రెడ్డి. వీళ్లలో వెంకీ తప్ప మిగిలిన వాళ్లంతా చాలా సీనియర్లు. అఖిల్ యంగ్ హీరో కావడం, పైగా అక్కినేని వారసుడు కావడంతో నాగార్జున కూడా సీనియర్ డైరెక్టర్లయితేనే అఖిల్ కు బెస్ట్ అని ఆలోచించి సీనియర్ డైరెక్టర్లతో అఖిల్ సినిమాలు చేయించాడు. కానీ అవేమీ అఖిల్ కెరీర్ గ్రోత్ కు ఉపయోగపడింది లేదు.
ఇప్పటివరకు చేసిన సినిమాలను ఏజెంట్ తో సక్సెస్ అందుకుని బ్యాలెన్స్ చేద్దామనుకున్న అఖిల్ కు ఆ సినిమా ఇంకా దారుణమైన ఫలితాన్నిచ్చింది. దీంతో ఇప్పుడు అఖిల్ టోటల్‌గా తన రూట్ మారుస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ల జోలికి పోకూడదని, యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేయాలని అఖిల్ డిసైడ్ అయినట్లు టాక్.
అఖిల్ తన తర్వాతి సినిమాను అనిల్ కుమార్ అనే కొత్త డైరెక్టర్ తో చేయనున్నాడని, ఆ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో నిర్మించనుందని తెలుస్తోంది. ఏజెంట్ తర్వాత ఇంట్లో వారి మాట వినడం మానేసిన అఖిల్‌కు కొత్త కుర్రాడైన అనిల్ తో చేయబోయే సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













