Akhanda2: అఖండ2 ఓటీటీ రిలీజ్ అప్పుడేనా?
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna), బోయపాటి శ్రీను(boyapati srinu) కలయికలో వచ్చిన తాజా సినిమా అఖండ2 తాండవం(Akhanda2 thandavam). అఖండ సినిమాకు సీక్వెల్ గా రావడం, బాలయ్య(balayya)- బోయపాటి కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ముందు నుంచి అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ఈ సినిమా వాస్తవానికి డిసెంబర్ 5న రిలీజవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడి డిసెంబర్ 12న రిలీజైంది.
భారీ అంచనాలతో రిలీజైన అఖండ2 ఆ అంచనాలను అందుకోలేక ఆడియన్స్ ను నిరాశ పరిచింది. మంచి ఓపెనింగ్స్, వీకెండ్ కలెక్షన్లు వచ్చినప్పటికీ తర్వాత మాత్రం సినిమా కలెక్షన్లు బాగా డల్ అయ్యాయి. అలా అని అక్కడితో అఖండ2 పని అయిపోలేదు. ఇప్పటికీ సినిమా థియేటర్లలో ఓ మోస్తరు కలెక్షన్లతో నడుస్తోంది. సంక్రాంతి సినిమాలు వచ్చేవరకు అఖండ2 థియేటర్లలో ఉంటుంది. ఆ సినిమాలొస్తే అఖండ2 రన్ ముగిసినట్టే అవుతుంది.
ఈ నేపథ్యంలో అఖండ2 ఓటీటీ రిలీజ్ ఎప్పుడుంటుందనేది అందరికీ ప్రశ్నగా మారింది. తాజా సమాచారం ప్రకారం అఖండ2 జనవరి 9నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. వాస్తవానికైతే జనవరి 2 నుంచే ఈ సినిమా ఓటీటీలోకి రావాల్సింది కానీ రిలీజ్ వారం ఆలస్యమవడంతో ఓటీటీ రిలీజ్ కూడా లేటవుతుందని తెలుస్తోంది. కాబట్టి పండక్కి థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే సినిమాలు చూసే ఆడియన్స్ కు అఖండ2 మంచి ఆప్షన్ గా నిలిచే ఛాన్సుంది.













