Akhanda2: మధ్య ప్రదేశ్ లో భారీ సాంగ్ ప్లాన్
వరుస సక్సెస్లతో మంచి జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి(Boyapati) దర్శకత్వంలో అఖండ2(akhanda2) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సూపర్ హిట్ సినిమా అఖండ(Akhanda)కు సీక్వెల్ గా ఈ మూవీ తెరకెక్కుతుండటంతో అందరికీ దీనిపై భారీ అంచనాలున్నాయి. ఇదిలా ఉంటే అఖండ2 విషయంలో ఇప్పటికే పలు విషయాలు వార్తల్లో నిలవగా ఇప్పుడు ఈ మూవీపై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తోంది.
అఖండ2 లో బోయపాటి ఓ భారీ సాంగ్ ను ప్లాన్ చేశాడని, ఆ సాంగ్ నవంబర్ 3 నుంచి నాలుగు రోజుల పాటూ మధ్యప్రదేశ్ లో షూటింగ్ జరుపుకోనుందని తెలుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా కోసం పలు లొకేషన్లలో షూట్ జరగ్గా, ఇప్పుడు మధ్యప్రదేశ్(Madhya Pradesh) లో అఖండ2 షూటింగ్ జరగనుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మహా కుంభమేళా(Maha Kumbhamela)లో జరగడంతో అఖండ2 పై మంచి అంచనాలున్నాయి.
అఖండ సినిమాతో ఎన్నో రికార్డులు సృష్టించిన బాలయ్య ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న అఖండ2తో మరిన్ని రికార్డులు సృష్టించాలని చూస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్(Pragya jaiswal), సంయుక్త మీనన్(Samyuktha menon) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా, 14 రీల్స్ ప్లస్(14 reels plus) బ్యానర్ భారీ బడ్జెట్ తో అఖండ2ను నిర్మిస్తోంది. డిసెంబర్ 5న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది.







