AKhanda2: అఖండ2 నెవర్ బిఫోర్ అనేలా!

నటసింహ నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. హిట్ సినిమాలు ఇచ్చిన జోష్ లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న బాలయ్య(balayya) ప్రస్తుతం అఖండ2(akhanda2) అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ అఖండ(akhanda) సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై అందరికీ మంచి అంచనాలున్నాయి.
దానికి తోడు బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో మూడు సినిమాలు రాగా, ఇప్పుడు రానున్న ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టిస్తుందని అందరూ ఎంతో నమ్మకంగా ఉన్నారు. దానికి తగ్గట్టే అఖండ2 గురించి వార్తలు వినిపిస్తున్నాయి.
అఖండ2 సినిమా సెకండాఫ్ నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా హిస్టరీ అనేలా ఉంటుందని, సెకండాఫ్ చూశాక ఫ్యాన్స్ తో పాటూ ఆడియన్స్ కూడా షాకవడం ఖాయమని చెప్తున్నారు. అఖండ2 సినిమాను బోయపాటి నెక్ట్స్ లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడని అంటున్నారు. ప్రగ్యా జైస్వాల్(pragya jaiswal), సంయుక్త మీనన్(samyuktha menon) కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మూవీలో ఆది పినిశెట్టి(Aadhi pinisetty) విలన్ గా కనిపించనుండగా, డిసెంబర్ 5న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.