Akhanda2: అఖండ2 కోసం బోయపాటి భారీ ప్లాన్
బాలకృష్ణ(Balakrishna)- బోయపాటి శ్రీను(Boyapati Srinu) కలయికలో వచ్చిన అఖండ(Akhanda) సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా అఖండ2(Akhanda2) తెరకెక్కుతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.
ఇప్పటికే బాలయ్య ఇంట్రో ఫైట్ సీన్ ను షూట్ చేశారని సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాలోనే హైలైట్ గా నిలుస్తుందని తెలుస్తోంది. రామ్ లక్ష్మణ్(Ram- Laxman) ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సీన్స్ ను దాదాపు 12 రోజుల పాటూ షూట్ చేశారట. ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ పాత్ర ఎవరు చేస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఈ సినిమా కోసం విలన్ ను బాలీవుడ్ నుంచి తీసుకొచ్చే ప్లానింగ్ లో బోయపాటి ఉన్నాడట. ఇప్పటికే డాకు మహారాజ్(Daku Maharaj) లో బాబీ డియోల్(Bobby Deol) విలన్ గా నటించగా, అఖండ2 కోసం మరో స్టార్ ను రంగంలోకి దించుతున్నారని టాక్. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాను మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ అవకుండా తెరకెక్కిస్తున్నారు. ప్రగ్యా జైశ్వాల్(Pragya Jaiswal) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్(Thaman) సంగీతం అందిస్తున్నాడు.













