Akhanda2: అఖండ2 రిలీజ్ డేట్ పై కొత్త పుకారు

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(balakrishna) వరుస సక్సెస్‌లతో బిజీగా ఉన్నారు. ఆ సక్సెస్ లు ఇచ్చిన జోష్ లో స్పీడుతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్న బాలయ్య(Balayya) నుంచి అఖండ2 తాండవం(Akhanda2 thandavam) సినిమా రానున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ మూవీ అఖండకు సీక్వెల్ గా వస్తోన్న ఈ సినిమాకు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వం వహిస్తున్నారు.
కాగా అఖండ2 పై అందరికీ భారీ అంచనాలున్నాయి. వాస్తవానికి ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. దీంతో అఖండ2 ఎప్పుడు రిలీజవుతుందా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు డిసెంబర్ లో ఈ సినిమా రావడం పక్కా అని టాక్ వినిపించింది. డిసెంబర్ లో రావాల్సిన రాజా సాబ్(raja saab) జనవరికి వాయిదా పడటంతో ఆ టైమ్ లో అఖండ2 వస్తుందని భావించారు.
అయితే ఇప్పుడు తాజా గాసిప్స్ ప్రకారం అఖండ2 కూడా జనవరికి వెళ్లే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతన్నది చూడాలి. ప్రగ్యా జైస్వాల్(pragya jaiswal), సంయుక్త మీనన్(samyuktha menon) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి(Aadhi pinisietty) విలన్ గా నడిస్తుండగా, తమన్(thaman) అఖండ2కు సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్(14 reels) బ్యానర్ లో గోపీ ఆచంట(gopi achanta), రామ్ ఆచంట(ram achanta)తో ఈ సినిమాను నిర్మిస్తుండగా బాలయ్య చిన్న కూతురు తేజస్విని(Tejaswini) అఖండ2కు సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు.