Akhanda2: ‘అఖండ 2’కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది – నిర్మాతలు
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అఖండ 2: ది తాండవం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. ప్రీమియర్లుకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
అఖండ 2 ది తాండవం సక్సెస్ సెలబ్రేషన్స్ లో నిర్మాత గోపి ఆచంట మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా ఒక వారం రోజులు వాయిదా పడింది. ఈ సందర్భంగా మా బాలయ్య బాబు గారికి, డైరెక్టర్ బోయపాటి శ్రీను గారికి, బాలయ్య బాబుగారి ఫ్యాన్స్ కి మా ప్రొడక్షన్ తరఫున సారీ చెప్తున్నాం. ఈ సమస్యని పరిష్కరించడానికి మ్యాంగో మీడియా రామ్ గారు, నిర్మాత దిల్ రాజు గారు చాలా సపోర్ట్ చేశారు. వారికి ధన్యవాదాలు. ఒక వారం రోజులు ఆలస్యం అయినప్పటికీ డిసెంబర్ 12న ఈ సినిమా ప్రీమియర్స్ తో రిలీజ్ అయింది. ప్రీమియర్స్ కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. మేము భ్రమరాంబంలో చూసాం. ఫ్యాన్స్ అసలు సీట్లో కూర్చోవడం లేదు. నిలుచుని చప్పట్లు విజిల్స్ తో అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. ఈరోజు మార్నింగ్ మ్యాట్నీ షోలు కూడా అద్భుతంగా ఉన్నాయి. అన్ని ఏరియాల నుంచి మంచి కలెక్షన్స్, రిపోర్ట్స్ వస్తున్నాయి. నార్త్ లో జి సినిమాస్ ద్వారా దాదాపు 800 స్క్రీన్స్ లో రిలీజ్ చేశాం. అక్కడ ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమాకి వర్డ్ ఆఫ్ మౌత్ బ్రహ్మాండంగా ఉంది. సూపర్ ట్రెండ్ లో టికెట్స్ బుక్ అవుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో సక్సెస్ సెలబ్రేషన్స్ చేయాలని భావిస్తున్నాము.
నిర్మాత రామ్ ఆచంట మాట్లాడుతూ.. ప్రీమియర్స్ రెస్పాన్స్ అదిరిపోయింది. రాత్రి జరిగిన ప్రీమియర్స్ కి నైజాం సీడెడ్ ఆంధ్ర కలిపి 10 కోట్లు గ్రాస్ చేసింది. కర్ణాటకలో కూడా దాదాపు కోటి రూపాయలు కలెక్ట్ చేసింది. ప్రీమియర్స్ లో కోటి రూపాయలు కలెక్ట్ చేసిన నాన్ కన్నడ సినిమాల్లో ఇది ఐదో సినిమా. బుకింగ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. డిస్ట్రిబ్యూటర్స్ నుంచి చాలా అద్భుతమైన రిపోర్ట్స్ వస్తున్నాయి. శుక్రవారం ఈవినింగ్ నుంచి ఫ్యామిలీస్ కూడా యాడ్ అవుతాయి. ఈ వీకెండ్ కి అదిరిపోయే ఫిగర్స్ చూస్తామని నమ్మకం ఉంది. రిలీజ్ తర్వాత అందరం చాలా హ్యాపీగా ఉన్నాం.ఓవర్సిస్ రెస్పాన్స్ కూడా అద్భుతంగా ఉంది. ఈ వీకెండ్ లో కూడా అది కొనసాగుతుంది. బుకింగ్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అన్ని ఫాస్ట్ గా ఫిల్లింగ్ అవుతున్నాయి. శని ఆదివారాల్లో ఇంకా సూపర్ గా ఉంటాయి. గ్రౌండ్ రిపోర్టు చాలా ఎక్సలెంట్ గా ఉంది. డిస్ట్రిబ్యూటర్స్ అందరు కూడా ఫుల్ గా ఫుల్ హ్యాపీగా ఉన్నారు. బజ్ బ్రహ్మాండంగా ఉంది. ముఖ్యంగా బాలయ్య బాబు ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. అద్భుతమైన సినిమా తీశారని ప్రశంసిస్తున్నారు.






