Akhanda2: అఖండ2 నైజాం కలెక్షన్లు ఎంతంటే?
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) హీరోగా బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన తాజా సినిమా అఖండ2(Akhanda2). భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. 2021లో వచ్చిన బ్లాక్ బస్టర్ అఖండ(akhanda) సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ముందు నుంచే భారీ హైప్ నెలకొంది. కానీ రిలీజ్ తర్వాత సినిమాలోని కంటెంట్ అంతగా మెప్పించలేకపోయింది.
వాస్తవానికి అఖండ2 డిసెంబర్ 5న రిలీజవాల్సింది కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడి డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు మొదట్లో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్సే వచ్చింది కానీ తర్వాత నెగిటివ్ మౌత్ టాక్ వల్ల సోమవారం నుంచి బాక్సాఫీస్ వద్ద అఖండ2కు కలెక్షన్లు బాగా డ్రాప్ అయ్యాయి. దీంతో సినిమా నెమ్మదించింది.
అయితే అఖండ2 సినిమా నైజాంలో ఇప్పటివరకు రూ.15.5 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ కలెక్ట్ చేసింది. మిగిలిన ఏరియాలతో పోలిస్తే నైజాంలో సిట్యుయేషన్స్ కాస్త బావున్నప్పటికీ, సినిమాకు ఉన్న క్రేజ్ ను బట్టి చూస్తే ఈ సినిమా కలెక్షన్లు ఇంకా బెటర్ గా ఉండాల్సిందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి బాలయ్య(Balayya)- బోయపాటి కాంబినేషన్లో వచ్చిన సినిమా మరోసారి మ్యాజిక్ చేస్తుందనుకుంటే ఈసారి మాత్రం ఆ మ్యాజిక్ మిస్ అయిందనే చెప్పాలి.






