AKhanda2: అఖండ2 ఫస్ట్ సాంగ్ ఆ రోజేనా?
 
                                    వరుస సక్సెస్లతో ఫుల్ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను(boyapati srinu) దర్శకత్వంలో అఖండ2(akhanda2) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ అఖండ(akhanda) సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని బోయపాటి పాన్ ఇండియా లెవెల్ లో భారీ గా తెరకెక్కిస్తుండగా అఖండ2 పై అందరికీ మంచి అంచనాలున్నాయి.
పలు భాషల్లో రిలీజ్ కానున్న ఈ మూవీతో బాలయ్య ఫ్యాన్స్ ను నెక్ట్స్ లెవెల్ లో ఎంటర్టైన్ చేయాలని చూస్తున్న బోయపాటి దాని కోసం ఎన్నో ప్లాన్స్ వేస్తున్నాడు. ఆ సర్ప్రైజ్ ల కోసం బాలయ్య ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే అఖండ2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టాలని భావిస్తోంది. అందులో భాగంగానే అఖండ2 ఫస్ట్ సింగిల్(Akhanda2 first single) కోసం మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కాగా ఈ మూవీ ఫస్ట్ సాంగ్ సై లేటెస్ట్ బజ్ వినిపిస్తోంది. బజ్ ప్రకారం ఈ మూవీ ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ నవంబర్ 5న రిలీజ్ చేయాలని అనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్(Pragya jaiswal), సంయుక్త మీనన్(Samyuktha menon) హీరోయిన్లుగా నటిస్తున్నారు.











 
                                                     
                                                        