Akhanda2: డబ్బింగ్ వర్క్స్‌లో అఖండ2
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) ప్రస్తుతం అఖండ2(akhanda2) సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను(boyapati srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్(pragya jaiswal), సంయుక్త మీనన్(samyuktha menon) హీరోయిన్లు గా నటిస్తుండగా ఆది పినిశెట్టి(aadhi Pinisetti) కీలక పాత్రలో నటిస్తున్నారు.
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో బోయపాటి ఫైనల్ కాపీని రెడీ చేసేందుకు తొందర పడుతున్నాడు. అందులో భాగంగానే అఖండ2 కు సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేయాలని చూస్తున్నాడు బోయపాటి. ఇప్పటికే బాలయ్య(balayya) ఫస్టాఫ్ కు డబ్బింగ్ ను పూర్తి చేయగా మరో రెండ్రోజుల్లో సెకండాఫ్ డబ్బింగ్ ను కూడా పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది.
డబ్బింగ్ కోసం బోయపాటి శ్రీను మిగిలిన ఆర్టిస్టుల డేట్స్ ను కూడా తీసుకుని ఆగస్ట్ మూడో వారం నాటికి డబ్బింగ్ వర్క్ ను పూర్తి చేసి త్వరగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ కాపీని రెడీ చేసి ఆ తర్వాత ప్రమోషన్స్ ను వేగవంతం చేయాలని చూస్తున్నారట. తమన్(thaman) సంగీతం అందించనున్న ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. దసరా కానుకగా రానున్న ఈ సినిమా మరి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.







