Akhanda2: అఖండ2.. ఇంకెప్పుడు మొదలుపెడతారు?
నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna) హీరోగా బోయపాటి శ్రీను(boyapati srinu) దర్శకత్వంలో తెరకెక్కుతున్న డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అఖండ2(Akhanda2). బ్లాక్ బస్టర్ అఖండ(Akhanda) మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు మరో నెల రోజులు కూడా లేదు. అయినప్పటికీ అఖండ2 టీమ్ మాత్రం ఎలాంటి ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయలేదు.
పాన్ ఇండియా స్థాయిలో రిలీజవుతున్న సినిమా రిలీజ్ డేట్ ఇంత దగ్గరపడినా ఇప్పటికీ ప్రమోషన్స్ ను మొదలుపెట్టకపోవడం ఫ్యాన్స్ కు ఆందోళనను కలిగిస్తోంది. వాస్తవానికైతే ఈపాటికే సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టి, ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకునేలా చేయాలి. కానీ మేకర్స్ మాత్రం ఇప్పటివరకు అఖండ2 నుంచి కనీసం ఫస్ట్ సింగిల్ ను కూడా రిలీజ్ చేయలేదు.
రిలీజ్ ఇంత దగ్గరికి వచ్చినా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవడంతో ఫ్యాన్స్ కాస్త టెన్షన్ పడుతూ, ఇప్పటికైనా పబ్లిసిటీ కార్యక్రమాలను మొదలుపెట్టాలని కోరుతున్నారు. ప్రగ్యా జైస్వాల్(Pragya jaiswal), సంయుక్త మీనన్(Samyuktha menon) హీరోయిన్లు గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్(thaman) సంగీతం అందిస్తుండగా, 14 రీల్స్ ప్లస్(14 reels plus) బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది.







