Akhanda2: పాన్ ఇండియా ప్రమోషన్స్ ను మొదలుపెట్టిన అఖండ2
శుక్రవారం ఉదయం నుంచి దేశమంతా బీహార్ అసెంబ్లీ ఎలక్షన్(bihar assembly elections) రిజల్ట్స్ తో మునిగిపోగా, టీవీ చూస్తున్న ప్రతీ ఒక్కరూ ఎవరికెన్ని సీట్స్ వచ్చాయని చూస్తుండగా మూవీ లవర్స్ కు ఎవరూ ఊహించని సర్ప్రైజ్ ఎదురైంది. పొలిటికల్ రిజల్ట్స్ లైవ్ వస్తున్న టైమ్ లో అఖండ2(Akhanda2) సినిమా ప్రమోషన్స్ కు మేకర్స్ తెర లేపారు. కేవలం సినిమా ఛానెల్స్, యూట్యూబ్ లో కాకుండా దేశం మొత్తం ఎంతో ఇంట్రెస్ట్ గా చూస్తున్న ఎలక్షన్ రిజల్ట్స్ లైవ్ కవరేజ్ లో అఖండ2 బ్యానర్లను వేస్తూ ప్రమోషన్స్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లారు.
ఈ బ్యానర్లలో బాలయ్య(balayya) అఘోరా గెటప్ తో పాటూ సినిమా డిసెంబర్ 5న రిలీజ్ అనే విషయం చాలా స్పష్టంగా ఉండటంతో అఖండ2 రిలీజ్ డేట్ నేషనల్ లెవెల్ లో ఉన్న ఆడియన్స్ అందరికీ ఒకేసారి చేరింది. అఖండ2 మేకర్స్ ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉండి ఒక్కసారిగా ఈ రేంజ్ ప్రమోషన్స్ ను మొదలుపెట్టడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఎలక్షన్ రిజల్ట్స్ రోజు ప్రతీ న్యూస్ ఛానెల్ టీఆర్పీ రేటింగ్స్ చాలా భారీగాఉంటాయి. అలాంటి రోజున ఎంతో ఖరీదైన స్లాట్ లో అఖండ2 ను ప్రమోట్ చేయడం చూస్తుంటే దర్శకనిర్మాతలకు సినిమాపై, మరీ ముఖ్యంగా నార్త్ మార్కెట్ పై ఉన్న నమ్మకమేంటో అర్థమవుతుంది. అఖండ2 కు నార్త్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకోవాలనే టార్గెట్ తోనే ఫస్ట్ సింగిల్ ను కూడా మేకర్స్ ముంబైలో లాంచ్ చేయాలని ప్లాన్ చేశారు. చూస్తుంటే అఖండ2 రిలీజ్ వరకు ఇక రోజుకో సర్ప్రైజ్ ఇచ్చేలానే ఉన్నారు.






