లాల్ సలామ్ విషయంలో తప్పు జరిగింది: ఐశ్వర్య
ఫిబ్రవరిలో రిలీజై ఆల్ టైమ్ డిజాస్టర్లలో చోటు దక్కించుకున్న సినిమాల్లో లాల్ సలామ్ కూడా ఒకటి. ఈ ఈ సినిమా ఫలితం విషయంలో అందరూ డైరెక్టర్ ఐశ్వర్యనే అంటున్నారు. తన తండ్రి క్యామియోని చేతులారా నాశనం చేసుకుందని విమర్శలు కూడా వచ్చాయి. ఫస్ట్ డే మార్నింగ్ షో కే రిజల్ట్ తెలియడంతో తర్వాత ఐశ్వర్య ఎక్కడా కనిపించలేదు.
ఇప్పుడు తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐశ్వర్య తన తప్పును ఒప్పేసుకుంది. లాల్ సలామ్ ఫస్ట్ వెర్షన్ లో ఇంటర్వెల్ తర్వాతే మొయినుద్దీన్ పాత్ర ప్రవేశిస్తుందని, అప్పటివరకు ఊళ్లో ఉన్న క్యారెక్టర్ల తాలూకు ఎమోషన్స్, క్రికెట్ కు సంబంధించిన డ్రామా వగైరాలతో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారట.
అయితే ఆ పాత్రను రజనీకాంత్ ఒప్పుకున్నాక సినిమా స్క్రిప్ట్ మొత్తం మారిపోయిందని, నిడివి ఎక్కువైనా ఫర్వాలేదనుకుని రజినీకు ఓ బిల్డప్ ఇంట్రో, ఫైట్ పెట్టాల్సొచ్చిందని, దాని వల్ల విక్రాంత్ స్పేస్ తగ్గిపోయి విష్ణు విశాల్ క్యారెక్టర్ కు సరైన తీరూ తెన్నూ లేకుండా పోవడంతో సినిమా మొత్తం కన్ఫ్యూజన్ కు గురైందని ఆమె చెప్పింది. అంతేకాదు రిలీజ్ కు రెండ్రోజుల ముందు వరకు ఎడిటింగ్ లో గందరగోళం నెలకొనడం వల్ల ఫైనల్ అవుట్‌పుట్‌ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునే ఛాన్స్ లేకుండా పోయిందని, ఈ సినిమా విషయంలో క్రిటిక్స్ చెప్పిన రివ్యూలకు ఏకీభవిస్తున్నట్లు ఐశ్వర్య తెలిపింది. ఏదేమైనా జరగాల్సిన నష్టం జరిగిపోయాక ఇప్పుడు ఎన్ని అనుకుని ఏం లాభం. లాల్ సలామ్ రిజల్ట్ అందరికీ చేదు జ్ఞాపకంగా మిగిలింది.













