Aishwarya Rajesh: ఐశ్వర్య నెక్ట్స్ ఏంటి?
ఐశ్వర్యా రాజేష్(Aishwarya Rajesh) పేరుకే తెలుగమ్మాయి కానీ అమ్మడు తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఈ ఏడాది ఐశ్వర్య తెలుగులో చేసిన సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki vasthunnam) సినిమా భారీ బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఐశ్వర్య పాత్రకు మంచి మార్కులు కూడా పడ్డాయి. దీంతో సంక్రాంతికి వస్తున్నాం తర్వాత ఐశ్వర్య తెలుగులో వరుస పెట్టి సినిమాలు చేస్తుందనుకున్నారు.
కానీ ఇప్పటివరకు ఐశ్వర్య తన తెలుగు సినిమాను అనౌన్స్ చేసింది లేదు. సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్ ను అలానే నిలుపుకోవాలని ఐశ్వర్య తర్వాత ఏ సినిమా చేయాలా అని ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఎటూ తేల్చుకోలేకపోతుంది. కాస్త లేట్ అయినా సరే మంచి కథ వచ్చే వరకు వెయిట్ చేసి అప్పుడే సినిమాను ఓకే చేయాలని చూస్తోంది.
ఇప్పటికే రెండు స్క్రిప్ట్స్ ను ఫినిష్ చేసిన ఐశ్వర్య ఈ ఇయర్ తర్వాత వాటిని ప్రకటించే అవకాశముంది. తమిళంలో కరుప్పర్ నగరం(Karuppar nagaram), మోహన్ దాస్(mohandas) మరియు తీయావర్ కులైగల్ నడుంగ(theeyavar kulaigal Nadunga) లాంటి సినిమాలు చేస్తున్న ఐశ్వర్య, కన్నడలో ఉత్తరాకాండ(Utharakanda) మూవీలో నటిస్తోంది. ప్రస్తుతం కథలు వింటున్న ఐశ్వర్య త్వరలోనే తెలుగు సినిమాను అనౌన్స్ చేసే ఛాన్సుంది.













