2.0 చిత్రం గెస్ట్ రోల్ లో ఐశ్వర్యారాయ్
రోబో చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న 2.0 చిత్రం టీజర్ ఇటీవల విడుదలై యు ట్యూబ్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. ప్రముఖ దర్శకుడు శంకర్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తునన్న ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌కుమార్, అమీజాక్సన్‌లు ముఖ్య పాత్రల్లో నటించారు. ఇక వీరితో పాటు స్టార్ హీరోయిన్, అందాల తార ఐశ్వర్యారాయ్ కూడా ఈ చిత్రంలో కన్పించనుందట. ఆమె ఈ చిత్రంలో అతిథిపాత్రలో నటించిందని సమాచారం. కాగా మొదటి పార్ట్‌లో రజనీ సరసన ఐశ్వర్యరాయ్ నటించిన విషయం తెలిసిందే. అయితే బాలీవుడ్ చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఇపుడు ఈ చిత్రంలో కూడా ఆమె కొద్దిసేపు స్క్రీన్‌పై మెరవనుంది. ట్రైలర్ దీపావళి రోజున విడుదల కానుంది. లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 29న ప్రేక్షకులను పలకరించనుంది. ఎఆర్ రెహమన్ సంగీతం అందించారు.













