Ahaan Pandey: ఆ స్టార్ డైరెక్టర్ తో సైయ్యారా హీరో మూవీ?

బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా సైయ్యారా(syeyara) తో హీరోగా పరిచయమయ్యాడు అహాన్ పాండే(ahaan panday). సైయ్యారా సినిమాలో అహాన్(ahaan) యాక్టింగ్ కు ఆడియన్స్ అందరూ ఫిదా అయిపోయారు. యంగ్ బ్యూటీ అనీత్ పద్దా(aneeth Paddha)తో కలిసి అహాన్ చేసిన రొమాన్స్ ఆడియన్స్ ను మెప్పించడంతో సైయ్యారా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.
రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ లో వచ్చిన లవ్ స్టోరీల్లో ఇదే పెద్ద సినిమా. మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ.579 కోట్లు సాధించింది. అయితే మొన్నటివరకు సైయ్యారా సక్సెస్ ను తనివి తీరా ఆస్వాదించిన అహాన్ పాండే తన తర్వాతి సినిమాను ఎవరితో చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు.
ఆ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెట్టేలా రీసెంట్ గా సంఘటన చోటు చేసుకుంది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ(sanjay leela bhansali) ఆఫీస్ వద్ద అహాన్ పాండే కనిపించడంతో అతని తర్వాతి సినిమా ఆ డైరెక్టర్ తోనే అంటూ బాలీవుడ్ లో కథనాలు మొదలయ్యాయి. మరి ఈ కాంబినేషన్ నిజంగానే సెట్స్ పైకి వెళ్తుందా లేక అహాన్ క్యాజువల్ గా సంజయ్ ఆఫీస్ కు వెళ్లాడా అనేది తెలియాల్సి ఉంది.