టైర్-2 టాప్ 5లో అఖిల్ క్రేజ్
హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి అఖిల్ కోరుకున్న సక్సెస్ ఇప్పటి వరకు తనకు రాలేదు. కానీ తన సినిమాలకు క్రేజ్ మాత్రం ఏం తక్కువ ఉండదు. తన మొదటి సినిమా అఖిల్ రిలీజ్ కు ముందు పరిస్థితి ఏంటని అడిగితే అక్కినేని ఫ్యాన్స్ ఓ రేంజ్లో వర్ణిస్తారు. చిరంజీవి కొడుకు రామ్ చరణ్ కు కూడా మొదటి సినిమాకు ఈ రేంజ్ హడావిడి జరగలేదు.
2015లో వచ్చిన అఖిల్ సినిమాకు అప్పట్లోనే రూ.46 కోట్ల బిజినెస్ జరిగింది అంటే మామూలు విషయం కాదు. అది కూడా ఓ డెబ్యూ హీరో సినిమాకు. ఏదో సినిమాకు బ్యాడ్ టాక్ రావడంతో సినిమా పోయింది కానీ, ఓ మోస్తరు టాక్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసేది. అఖిల్ స్టార్ హీరో అయిపోయేవాడు. ఇప్పటికీ ఓ డెబ్యూ హీరో సినిమాకు వచ్చిన అత్యధిక బిజినెస్ రికార్డు అఖిల్ పేరు మీదే ఉంది.
అంతేకాదు, టైర్- 2 హీరోల్లో థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టిన సినిమాల్లో అఖిల్ ఇప్పటికీ థర్డ్ ప్లేస్ లో ఉంది. ఈ లిస్ట్ లో లైగర్ రూ.90 కోట్లతో మొదటి స్థానంలో ఉండగా, దసరా, అఖిల్, ది వారియర్ 2,3,4 స్థానాల్లో నిలిచాయి. ఇప్పుడు అఖిల్ కొత్త సినిమా ఏజెంట్ రూ.37 కోట్ల థియేట్రికల్ బిజినెస్‌లో ఐదో స్థానానికి చేరుకుంది. అంటే టాప్5లో రెండు అఖిల్ సినిమాలే ఉన్నాయన్నమాట.
వీటిలో మొదటి నాలుగింట్లో ఒక్క దసరా మాత్రమే టార్గెట్ ను రీచ్ అయి, బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుని, నైజాంలో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ పరిస్థితుల్లో మరి అఖిల్ ఏజెంట్‌తో బయ్యర్లను సేఫ్ జోన్ లోకి తీసుకెళ్లి, తన కెరీర్ లోనే పెద్ద హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.













