స్టార్ హీరో సరసన స్టార్ హీరోయిన్లు
కోలీవుడ్ స్టార్ విజయ్ సర్కార్ చిత్రంతో ఓ బిగ్గెస్ట్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ స్టార్ హీరో తన 63వ సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించే సినిమాలో విజయ్ నటిస్తాడు. ఈ చిత్రాన్ని సంక్రాంతి పండుగ రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభిస్తారు. తాజా సమాచారం ప్రకారం విజయ్అట్లీ కాంబినేషన్లో తెరకెక్కే ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్లు నయనతార, నమంత నటించన్నుట్టు తెలిసింది. గతంలో విల్లు చిత్రలో విజయ్ సరసన నయనతార నటించగా, తేరి, మెర్సల్ చిత్రాల్లో విజయ్‌తో సమంత కలిసి నటించింది. ఇక విజయ్, అట్లీ కాంబినేషన్లో వచ్చిన తేరి, మెర్సల్ చిత్రాలు బ్లాక్‌బస్టర్ హిట్స్‌గా నిలిచి రికాక్డు కలెక్షన్లను వసూలు చేశాయి. దీంతో వీరి కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ మూడవ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.













