నాని సరసన అదితిరావు ?
ఈ వేసవిలో జెర్సీ తో సందడి చేయబోతున్నాడు యువ కథానాయకుడు నాని. మరో చిత్రం గ్యాంగ్‌లీడర్ ని ఇటీవలే పట్టాలెక్కించాడు. విక్రమ్ కె.కుమార్ తెరకెక్కిస్తున్న చిత్రమది. కథల ఎంపికలో ముందుంటారు నాని. ఆయన గ్యాంగ్‌లీడర్ తర్వాత చేయబోయే సినిమా కూడా ఇప్పటికే ఖరారైంది. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఆ చిత్రం తెరకెక్కబోతోంది. మల్టీస్టారర్ సినిమాగా రూపొందనున్న ఆ చిత్రంలో నాని సరసన అదితిరావు హైదరీ నటించబోతున్నట్లు సమాచారం. మోహనకృష్ణ తెరకెక్కించిన సమ్మోహనం లో అదితినే కథానాయిక. అందులో ఆమె అందం, అభినయం ప్రేక్షకుల్ని మెప్పించింది. అందుకే మరోమారు ఆమెనే ఎంపిక చేసినట్టు తెలిసింది.













