ఆదిపురుష్ బిజినెస్ ఓ రేంజ్లో..
ప్రభాస్ హీరోగా రాబోతున్న తాజా చిత్రం ఆదిపురుష్. జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా బిజినెస్ చాలా స్పీడ్ గా జరుగుతుందని సమాచారం. ట్రైలర్ రిలీజ్ ముందు వరకు ఆదిపురుష్ పరిస్థితి ఒకలా ఉండేది. కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత సమీకరణాలు మొత్తం మారిపోయాయి. ట్రైలర్ తో ఒక్కసారిగా సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.
దీంతో ఈ సినిమాకు బయ్యర్లు పెరిగిపోయారు. ఆదిపురుష్ కోసం డిస్ట్రిబ్యూటర్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. కేవలం రెండు తెలుగు రాష్ట్రాల నుంచే 160-170 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగుతుందని టాక్ వినిపిస్తోంది. మొదట్లో ఈ సినిమాను యువి సంస్థనే డిస్ట్రిబ్యూట్ చేయాలనుకున్నప్పటికీ సాహో, రాధేశ్యామ్ సినిమాలకు సంబంధించిన సెటిల్మెంట్స్ ఇంకా పెండింగ్ ఉండటంతో ఆ డిస్ట్రిబ్యూషన్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో యువి ప్లేస్ లోకి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వచ్చిందని సమాచారం. ఈ సినిమాను కొని భారీ రేంజ్ లో రిలీజ్ ను ప్లాన్ చేస్తుందని ఇన్సైడ్ టాక్. దీనికి సంబంధించిన డీల్ కూడా జరిగిందట. ట్రైలర్ తో పెరిగిన అంచనాల కంటే జై శ్రీరామ్ సాంగ్ రిలీజ్ తర్వాత అంచనాలు ఆకాశానికి అంటుతాయని, ఇండియన్ హిస్టరీలో ఆదిపురుష్ ఓపెనింగ్స్ రికార్డు సృష్టించడం ఖాయమని చెప్తున్నారు.
ఇక నుంచి రిలీజ్ వరకు ప్రతి రోజూ ఆదిపురుష్ కు సంబంధించిన ఏదొక కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుందట. అంతేకాదు జూన్ 16న దాదాపు అన్ని థియేటర్లలో ఆదిపురుష్ సినిమానే రిలీజ్ చేయాలనే విధంగా కూడా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ ఆదిపురుష్ కు అన్నీ బాగుండి పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఇక సినిమాను ఆపడం అసాధ్యమే.













