మొదటిసారి బయటి కథతో రీమేక్ చేసేందుకు రెడీ అయిన అడివి శేష్!
పవన్‌కల్యాణ్ `పంజా`లో తన నటనతో అందరి దృష్టినీ ఆకర్షించిన అడివి శేష్ ఆ తర్వాత రచయితగా, దర్శకుడిగా తన టాలెంట్‌ను చూపించాడు. కొన్ని సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూనే క్షణం, గూఢచారి, ఎవరు వంటి సినిమాల్లో సోలో హీరోగా నటించాడు. ఆ సినిమాలు హీరోగా అతనికి స్పెషల్ ఇమేజ్‌ని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం మేజర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే బాలీవుడ్లో సూపర్‌హిట్ అయిన ఆర్టికల్ 15 చిత్రం రీమేక్‌లో శేష్ నటించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రం తెలుగులో రీమేక్ కాబోతోందని, వెంకటేష్ హీరోగా సురేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తాడని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సినిమాను అడివి శేష్ చేయబోతున్నాడన్న కొత్త వార్త వచ్చింది. ఇప్పటివరకు తన కథలతో సినిమాలు చేస్తూ వచ్చిన అడివి శేష్ మొదటిసారి ఓ రీమేక్ చేయబోతున్నాడు.
ఈ మధ్యకాలంలో కొత్త కథల కోసం ఎదురుచూడకుండా రీమేక్‌లపై దృష్టి పెట్టారు దర్శకనిర్మాతలు. టాలీవుడ్లోనే కాదు, టాలీవుడ్లో, కోలీవుడ్‌లో.. ఇలా అన్ని భాషల్లో రీమేక్‌లు బాగా పెరిగాయి. రీమేక్ అయితే మినిమం గ్యారెంటీ ఉంటుందన్న నమ్మకం కావచ్చు, కథలో కొత్తదనం కావచ్చు, మేకర్లు తమ దృష్టిని అటువైపు మళ్లించారు. సొంత కథలతో సినిమాలు చేసే అడివి శేష్ కూడా రీమేక్ చేసేందుకు సిద్ధపడ్డాడంటే వాటి హవా ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్టికల్ 15 అనేది ఒక స్పెషల్ మూవీ. ఈ సినిమాను తెలుగులో ఎవరు రీమేక్ చేస్తున్నారు, దర్శకుడు ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.













