రాజకీయాల్లోకి సినీ నటి త్రిష ?
అగ్ర కథానాయిక త్రిష రాజకీయూల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న ప్రచారం జరుగుతుంది. త్రిష రాజకీయ ఎంట్రీపై సినీవర్గాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె క్రియాశీల రాజకీయాల్లో చేరి ప్రజలకు సేవ చేయాలనుకొంటున్నట్లు కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. అంతేకాదు ఈ అందాల తార కాంగ్రెస్ పార్టీలో చేరాలని కూడా నిర్ణయించుకున్నట్లు ఊహాగానాలు వినపడుతున్నాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం లేకపోగా.. త్రిష కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఒకవేళ ఆమె రాజకీయ అరంగేట్రం నిజమైతే తన అందం, అభినయంతో వెండితెరపై ప్రేక్షకుల్ని మెప్పించిన త్రిష. రాజకీయాల్లో ఓటర్లను ఏ మేరకు ప్రభావితం చేయగలుగతారో చూడాలి మరి.













