నాలో అందం చూడొద్దు.. అభినయాన్నే చూడండి
అందం, అభినయం, కథానాయికల పాలిట కొంగు బంగారం లాంటి కాంబినేషన్. దానికి అదృష్టం కూడా తోడైతే ఇక చెప్పక్కర్లేదు. తమన్నాలో ఇవి మూడూ ఉన్నాయి. అందుకే తక్కువ కాలంలోనే అందలం ఎక్కేసింది. మిమ్మల్ని అందగత్తెగా గుర్తుంచుకోవాలా? అభినయ తరాగానా? అని అడిగితే అందం అనేది కేవలం ఆకర్షణలోంచి పుట్టకొచ్చే విషయం. రేపు నాకంటే అందమైన వాళ్లు వస్తే నన్ను మర్చిపోతారు. నటీమణులకు జీవిత కాలం ఎక్కువ. నటనే నమ్ముకున్న కథానాయికలు దశాబ్దాలుగా చిత్రసీమని ఏలారు. అలాంటి వాళ్లంతా నాకు ఆదర్శమే. గొప్ప కథానాయికలంతా అందాన్ని కాదు, కేవలం అభినయాన్నే నమ్ముకున్నారు. నటిగా ముద్ర పడిపోతేనే ఎక్కువ కాలం గుర్తుండిపోతా. కాబట్టి నాలో అందం చూడొద్దు, అభినయాన్నే చూడండి. తమన్నా గ్లామర్తార అనేది నాకు ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ తమన్నా మంచి నటి అనేది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అంది తమన్నా.













