భీమవరంలో తమన్నా సందడి
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సినీ నటి తమన్నా భాటియా సందడి చేశారు. స్థానిక అన్నపూర్ణ థియేటర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన హ్యాపీ మొబైల్స్ (మల్ల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్స్ స్టోర్స్)ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాన్యులకు సైతం అతి తక్కువ ధరలకే మెగా ఆఫర్లతో మొబైల్స్‌ను హ్యాపీ మొబైల్స్ అందించనుందన్నారు. అన్ని వయస్సులవారికీ సంబంధింబచిన మొబైల్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సంస్థ అధినేత క్రిష్ట పవన్ మాట్లాడుతూ వినియోగారులకు, ఉద్యోగులకు, వ్యాపార భాగస్వాములకు హ్యాపీని అందించడమే హ్యాపీ మొబైల్స్ లక్ష్యమన్నారు.













