సీబీఐ వర్సెస్ లవర్స్ గీతాలను ఆవిష్కరించిన సుమన్
వంశీ, జైన్ నాని, ద్వి, శ్రావణి నిక్కి, నటీనటులుగా నెట్రంబాక హరిప్రసాద్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం సీబీఐ వర్సెస్ లవర్స్. ఎన్.హరితా ప్రియా రెడ్డి నిర్మాత. సుమన్, సత్య ప్రకాశ్ కీలక పాత్రధారులు. ఘన శ్యామ్ స్వరకర్త. ఈ సినిమా పాటల్ని సుమన్ ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ తొందర పాటు నిర్ణయాల వల్ల స్టూడెంట్స్ ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన చిత్రమిది అని చెప్పారు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అనే సందేశం ఇస్తూనే చక్కని వినోదాన్ని పంచే సినిమా ఇది. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం అని నిర్మాత తెలిపారు.













