దుర్మార్గుడు ఆడియోను ఆవిష్కరించిన సుమన్
బేబీ ఆరాధ్య సమర్పణలో అమృత మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజవంశీ నిర్మించిన చిత్రం దుర్మార్గుడు. విజయ్ కృష్ణ ఫిర్దోస్ భాను హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి సునీల్ జంపా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆడియోను ప్రముఖ హీరో సుమన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ట్రైలర్‌ను ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేశారు. సుమాన్ మాట్లాడుతూ లిరిక్స్ చాలా అద్భుతంగా ఉన్నాయన్నారు. హీరో విజయ్‌కృష్ణ మొదటిసినిమా అయినా బాడీ లాంగ్వేజ్ చాలా చక్కగా ఉందన్నారు. డైరెక్టర్ పనితనం కన్పిస్తోందన్నారు. తక్కువ బడ్జెట్ సినిమా అయినా విజువల్స్ చాలా బాగున్నాయని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్, బెక్కం వేణుగోపాల్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, హీరోయిన్ ఫిర్దోస్, హీరో విజయ్‌కృష్ణ, దర్శకుడు సునీత్ జంపా, ప్రొడ్యూసర్ రాజవంశీ తదితరులు మాట్లాడారు.













