సీఎం ఆహ్వానిస్తే రాజకీయాల్లోకి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానిస్తే రాజకీయాల్లోకి వచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సినీ నటుడు సుమన్ వెల్లడించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల గౌడ జాతి సంక్షేమం కోసం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఆయన తమ జాతికి చేస్తున్న సాయానికి పాదాభివందనం చేస్తున్నానంటూ ఉద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం తెలుగు, హిందీ, కన్నడ, తమిళ సినిమాలతో బిజీగా ఉన్నానని, రాజకీయాల గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయాలోకి రమ్మని తనని ఆహ్వానిస్తే టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. గౌడ జాతికి కేసీఆర్ చేసిన సహాయానికి తన నుంచి ఎలాంటి సాయం పొందాలనుకున్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సృష్టం చేశారు.













