Mohanlal: మోహన్‌లాల్‌కి మరో అరుదైన గౌరవం

ఇటీవలే ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందుకున్న అగ్రహీరో మోహన్‌లాల్ (Mohanlal) కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన్ని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) సీవోఏఎస్ కమెండేషన్ కార్డు తో సత్కరించారు. మోహన్‌లాల్ గతేడాది వయనాడ్ ప్రకృతి వైపరీత్యం సమయంలో సహాయ చర్యలకు స్వచ్ఛందంగా అందించిన విరాళం, సైనికుల పట్ల ఆయనకున్న గౌరవానికి గుర్తింపుగా ఈ కార్డును అందజేసినట్లు ఆర్మీ చీఫ్ ఓ ప్రకటనలో తెలిపారు.