పార్టీ ప్రకటన ఆ రోజు కాదు
తమిళ సూపర్‌స్టార్ కమల్‌హాసన్ తన పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడనేదానిపై సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నాడు. తాజాగా తన బర్త్ డే అయిన నవంబర్ 7నే పార్టీని ప్రారంభించబోతున్నట్లు తెలిసిందే. అయితే ఈ వార్తలను కమల్ ఖండించారు. మీడియా చెప్పినట్లు పార్టీని ప్రకటించను. నవంబర్ 7న చాలా మందితో ఓ కార్యక్రమం మాత్రం నిర్వహిస్తున్నా అని కమల్ చెప్పాడు. తమిళ మ్యాగజైన్ వికటన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నవంబర్ 7న ముఖ్యమైన ప్రకటన చేస్తామని, సిద్ధంగా ఉండండి అని కమల్ చెప్పిన విషయం తెలిసిందే. ఆ ప్రకటనలోనే అన్ని వివరాలను వెల్లడిస్తానని కూడా అన్నారు. దీంతో అదే రోజు పార్టీని ప్రారంభిస్తారని అంతా అనుకున్నారు.













