OG: ఓజిలో బోయపాటి రేంజ్ ఫైట్
యాక్షన్ సీన్స్ అనగానే అందరికీ గుర్తొచ్చే డైరెక్టర్ బోయపాటి శీను(Boyapati Srinu). ఆయన సినిమాల్లో యాక్షన్ సీన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటాయి. యాక్షన్ సీన్స్ ను బలంగా తీయడంలో బోయపాటికి మంచి పేరుంది. చిరంజీవి(Chiranjeevi) సైతం బోయపాటితో వర్క్ చేయాలని ఆశ పడుతున్నాడంటే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఓజి(OG) సినిమాలో సుజిత్(Sujeeth) కూడా బోయపాటి రేంజ్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
సుజిత్ సినిమాల్లో మామూలుగా యాక్షన్ అంటే హీరో, విలన్ తుపాకులతో కాల్చుకోవడమే ఉంటుంది. లేదంటే ఛేజింగ్ సీన్స్ ఉంటాయి. ఓజి గ్యాంగ్స్టర్ సినిమా అయినప్పటికీ గన్ ఫైరింగ్స్ ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఓ 300 మందిపై దాడి చేసేలా ఓ యాక్షన్ సీన్ ఉందట. ముంబైలో స్పెషల్ గా వేసిన ఓ సెట్ లో ఈ సీక్వెన్స్ ను షూట్ చేస్తారని తెలుస్తోంది.
ఇది నిజమైతే మాత్రం పవన్ కెరీర్ లో ఇదో హిస్టరీగా మిగిలిపోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు పవన్ ఎప్పుడూ 300 మందితో ఫైట్ చేసింది లేదు. మొదటిసారి ఓజి కోసం సుజిత్ అంతమందిని రంగంలోకి దించితే అది కచ్ఛితంగా పవన్ కెరీర్లో స్పెషలే అవుతుంది. ఓజి సినిమా మొత్తానికే ఆ సీక్వెన్స్ హైలైట్ అవనుందని యూనిట్ వర్గాలంటున్నాయి. మరి ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.













