రెండు పాటల మినహా.. ఆచార్య పూర్తి
కథానాయకుడు చిరంజీవి దర్శకుడు కొరాటల శివ కలయికలో రూపొందుతోన్న తొలి చిత్రం ఆచార్య. రామ్‌చరణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. చిరుకు జోడిగా కాజల్ నటిస్తుండగా, చరణ్ సరసన పూజా హెగ్డే కనిపించనుంది. ఇటీవలే ఆఖరి షెడ్యూల్ ప్రారంభించుకున్న ఈ సినిమా ఇప్పుడు చిత్రీకరణ పూర్తి చేసుకుంది. రెండు పాటలు మినహా టాక్ పార్ట్ మొత్తం పూర్తయినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్బంగా చిత్ర బృందం ఓ కొత్త లుక్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో చిరు, చరణ్ ఓ అడవిలో చెట్టు దగ్గర కూర్చుని కనిపించారు. మేం అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా టాక్ పార్ట్ పూర్తి చేశాం. ఆగస్టు 20 నుంచి చిరంజీవి చరణ్‌ల మీద ఓ పాటను, అలాగే చరణ్, పూజా హెగ్డేల పైన మరో గీతాన్ని చిత్రీకరిస్తాం. నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో చిరంజీవి పాత్ర చాలా శక్తిమంతంగా ఉంటుంది. చరణ్ సిద్ధ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు అని దర్శక నిర్మాతలు తెలియజేశారు. ఈ సినిమాకి మణిశర్మ స్వరాలందిస్తున్నారు. ఎస్.తిరుణ్ణావుక్కరసు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.













