ఆచారి అమెరికా యాత్ర ట్రైలర్ విడుదల
దేనికైనా రెడీ, ఈడోరకం ఆడోరకం వంటి హిట్ చిత్రాలని తెలుగు ప్రేక్షకులకి అందించిన మంచు విష్ణు- జి.నాగేశ్వర రెడ్డి కాంబినేషన్ ఇప్పుడు హ్యట్రిక్ పై కన్నేసింది. పద్మజ పిక్చర్స్ బేనర్ పై కీర్తి చౌదరి నిర్మాణంలో ఆచారి అమెరికా యాత్ర అనే చిత్రం చేసింది ఈ కాంబో. జనవరి 26 మూవీ విడుదల కి ప్లాన్ చేయగా, టీజర్స్, పోస్టర్స్ తో సినిమాపై భారీ హైప్స్ పెంచుతుంది టీం. తాజాగా చిత్ర ట్రైలర్ విడుదల చేసి మరిన్ని అంచనాలు పెంచారు. ఇందులో ఆసక్తికర సంభాషణలతో పాటు బ్రహ్మానందం కామెడీ కూడా అలరిస్తుంది. ఢీ చిత్రంలో విష్ణు, బ్రహ్మీ మధ్య సంభాషణలకు ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇప్పుడు ఆచారి అమెరికా యాత్రలోనూ మరోసారి ఈ కామెడీని రిపీట్ చేయనున్నట్లు సమాచారం. ప్రగ్వా జైస్వాల్ ఇందులో కథానాయికగా నటిస్తుంది. థమన్ సంగీతంలో రూపొందిన పాటలు ఇప్పటికే విడుదల కాగా, వాటికి మంచి రెస్పాన్స్ వచ్చాయి. మరి తాజాగా విడుదలైన చిత్ర ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండి.













