Abhinaya: భర్త ఫేస్ ను రివీల్ చేసిన అభినయ
నటి అభినయ(Abhinaya) త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన కార్తీక్ వేగేశ్న(Karthik Vegesna)తో అభినయకు మార్చి 9వ తేదీన నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఆ టైమ్ లో కేవలం తనకు కాబోయే భర్తతో కలిసి గుడిలో గంట కొడుతున్న ఫోటోను మాత్రమే పోస్ట్ చేసిన అభినయ ఇప్పుడు తనకు కాబోయే భర్త ఫోటోను షేర్ చేసింది.
వేగేశ్న కార్తీక్ తో తనకు ఎంగేజ్మెంట్ అయిన విషయాన్ని తెలియచేస్తూ అతనితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది అభినయ. గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్న కార్తీక్, అభినయ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు. భీమవరంకు చెందిన కార్తీక్ కు తెలుగు రాష్ట్రాల్లో పలు బిజినెస్లు ఉన్నాయి. కార్తీక్ ను ఆయన సన్నిహితులు సన్నీ వర్మ(Sunny Varma) అని పిలుస్తుంటారు.
కాబోయే భర్త ఫోటోను అభినయ షేర్ చేయడంతో ఆమెకు విషెస్ వెల్లువెత్తుతున్నాయి. భీమవరం లేదా చెన్నైలో వీరి పెళ్లి జరగనుందని, త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయని అంటున్నారు. తెలుగులో పలు సినిమాల్లో నటించిన అభినయకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు(Seethamma Vakitlo Sirimalle Chettu)లో వెంకటేష్(Venkatesh), మహేష్(Mahesh Babu) చెల్లెలుగా మంచి గుర్తింపు దక్కింది. అభినయ పుట్టుకతోనే చెవిటి, మూగ అయినప్పటికీ నటిగా మాత్రం ఆమె మంచి పేరు సంపాదించుకుంది.













