AA22: అల్లు అర్జున్- అట్లీ సినిమాపై షూటింగ్ అప్డేట్
పుష్ప(Pushpa) ఫ్రాంచైజ్ సినిమాలతో విపరీతమైన క్రేజ్, ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తన తర్వాతి సినిమాను వాస్తవానికైతే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram) తో చేయాల్సింది కానీ తన క్రేజ్ ను విస్తరించుకోవాలనే నేపథ్యంలో బన్నీ(bunny), సక్సెస్ఫుల్ డైరెక్టర్ అట్లీ(Atlee)తో తన తర్వాతి సినిమాను చేయడానికి రెడీ అయ్యాడు.
ఆల్రెడీ దానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇప్పటికే రాగా దానిపై మంచి బజ్ ఏర్పడింది. బన్నీ కెరీర్లో 22వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ నెట్టింట వినిపిస్తోంది. అల్లు అర్జున్- అట్లీ సినిమా రెగ్యులర్ షూటింగ్ జులై నుంచి మొదలుకానున్నట్టు తెలుస్తోంది.
ఎట్టి పరిస్థితుల్లో జులై లో ఓ షెడ్యూల్ ను మొదలుపెట్టాలని అట్లీ ప్లాన్ చేస్తున్నాడట. ఫస్ట్ షూటింగ్ ముంబైలో జరగనున్నట్టు సమాచారం. ఆల్రెడీ ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా, బన్నీ కూడా అందులో ఇన్వాల్వ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లు రంగంలోకి దిగగా, ఈ మూవీని సన్ పిక్చర్స్(Sun pictures) సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.






