Varanasi: వారణాసిలో హనుమంతుడిగా తమిళ హీరో?
మహేష్ బాబు(mahesh babu) ఫ్యాన్స్ తో పాటూ యావత్ భారతదేశం రాజమౌళి(Rajamouli)- మహేష్ బాబు కాంబోలో వస్తున్న సినిమా అప్డేట్ కోసం ఎదురుచూసింది. ఆ ఎదురుచూపులకు తెరదింపుతూ రీసెంట్ గా సినిమా టైటిల్ ను వారణాసి(Varanasi)గా అనౌన్స్ చేయడంతో పాటూ ఓ భారీ ఈవెంట్ ను ఏర్పాటు చేసి వారణాసి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశాడు జక్కన్న(jakkanna). ఈ గ్లింప్స్ తో అందరికీ జక్కన్న మరో ఎపిక్ తో రాబోతున్నాడని తెలిసిపోయింది.
వారణాసి సినిమాను చరిత్ర, పురాణాలతో పాటూ సైన్ ను బేస్ చేసుకుని తీస్తున్నాడని గ్లింప్స్ చూస్తుంటే తెలుస్తోంది. పైగా ఈ మూవీని పురాణాలకు లింక్ చేసి జక్కన్న మహేష్ బాబు ను శ్రీరాముడిగా చూపించబోతున్నాడు. వారణాసి మూవీలో మహేష్(mahesh) ఏకంగా 30 నిమిషాల పాటూ రాముడి పాత్రలో కనిపించనున్నాడు.
రామాయణంలో రాముడి పాత్రతో పాటూ హనుమంతుడి పాత్ర కూడా ఎంతో ముఖ్యం. అందుకే ఈ పాత్ర కోసం రాజమౌళి ఓ తమిళ హీరోను తీసుకోవాలని భావిస్తున్నాడని తెలుస్తోంది. తమిళ స్టార్ హీరో ను తీసుకుంటే వారణాసి మూవీకి క్రేజ్ తో పాటూ కోలీవుడ్ లో కూడా సినిమాపై మంచి బజ్ ఏర్పడుతుందనే ఆలోచనతోనే జక్కన్న ఈ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తోంది. మరి హనుమంతుడిగా రాజమౌళి ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి.






