క ముందు మూడు సవాళ్లు
రేపు రిలీజ్ కాబోతున్న క(Ka) సినిమా రిజల్ట్ విషయంలో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram)తో పాటూ ఆ చిత్ర యూనిట్ అంతా ఎంతో నమ్మకంగా ఉంది. రిస్క్ అయినప్పటికీ ఇవాళ సాయంత్రం నుంచే ప్రీమియర్లకు రెడీ అయ్యారంటే కంటెంట్ పై వారి కాన్ఫిడెన్స్ అర్థమవుతుంది. ఎప్పుడూ సాఫ్ట్ గా, బ్యాలెన్డ్స్ గా మాట్లాడే కిరణ్ అబ్బవరం ఈ సినిమా క్లైమాక్స్ నచ్చకపోతే ఏకంగా సినిమాలే మనేస్తానని చెప్పి ఆశ్చర్యానికి గురి చేశాడు.
అయితే ఈ సినిమా ముఖ్యంగా మూడు పరీక్షలు పాస్ అవాల్సి ఉంది. అందులో మొదటిది బ్రేక్ ఈవెన్. క సినిమా సుమారు రూ.12 థియేట్రికల్ బిజినెస్ చేసుకుందని సమాచారం. అంటే సినిమా బ్లాక్ బస్టర్ అయితేనే ఇంత మొత్తంలో షేర్ వచ్చే ఛాన్సుంది. రెండోది నాన్ థియేట్రికల్ డీల్. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన ఓటీటీ డీల్ జరగలేదు.
నిర్మాతలు అనుకున్న దానికి, ఓటీటీ కంపెనీలు చెప్తున్న రేటుకు తేడా ఉండటం వల్ల సినిమా రిలీజయ్యాక చూసుకుందామని పెండింగ్ పెట్టినట్లు సమాచారం. హిట్ అయితే ఈ డీల్ జరగడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక మూడోది పోటీ. క సినిమాతో పాటూ లక్కీ భాస్కర్(Lucky Bhaskar), బఘీరా(Bagheera), అమరన్(Amaran) సినిమాలు కూడా రిలీజవుతున్నాయి. వీటన్నింటినీ తట్టుకుని క సినిమా హిట్ అయితేనే కిరణ్ మళ్లీ ట్రాక్ లోకి వచ్చే ఛాన్సుంది. పాజిటివ్ టాక్ వస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ పెద్దగా కష్టమేమీ కాదు. మరి కిరణ్ నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.













