2018 ఆ మార్క్ ని దాటడం కష్టమే!
పెద్దగా టైమ్ లేకపోవడంతో ప్రమోషన్స్ ఏమీ లేకుండా కేవలం ఒక్క ప్రెస్ మీట్‌తో 2018 అనే మలయాళ బ్లాక్ బస్టర్ ను తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లని రాబడుతోంది. దీంతో పాటూ రిలీజైన మేమ్ ఫేమస్ సినిమాను దాటి మంచి మౌత్ టాక్ తో ఈ సినిమా దూసుకెళ్తుంది.
కంటెంట్ పరంగా మంచి పేరు రావడంతో ఈ సినిమాకు పబ్లిక్ సపోర్ట్ తో పాటూ కలెక్షన్లు కూడా జోరుగా వస్తున్నాయి. రెండు రోజులకే మూడు కోట్లకు దగ్గరగా వెళ్లిన వసూళ్లు సోమవారానికి 5 కోట్ల మార్క్ ను ఈజీగా దాటేస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కూడా కాంతార తరహాలో స్లో పాయిజన్‌గా ప్రేక్షకుల్లోకి వెళ్తుందని నిర్మాతలు ధీమాతో ఉన్నారు.
సిటీస్ లో 2018 కు హౌస్ ఫుల్ బోర్డ్స్ పడుతున్నాయి కానీ బి, సి సెంటర్స్ లో మాత్రం ఈ సినిమాకు అనుకున్నంత ఆదరణ లేదు. మాస్ కోరుకునే అంశాలు ఈ సినిమాలు లేకపోవడంతో ఈ సినిమాకు సింగిల్ స్క్రీన్స్ లో పెద్ద ఫ్లో లేదు. కానీ కాంతారకు డే2 నుంచే విపరీతమైన జనం థియేటర్లకు ఎగబడ్డారు. అందుకే చిరంజీవి గాడ్ ఫాదర్ లాంటి సినిమాను కూడా తట్టుకుని మరీ నిలబడగలిగింది.
2018 సినిమా మంచి సక్సెస్ఫుల్ మూవీ అనొచ్చు కానీ కాంతార రేంజ్ సినిమా అయితే ఖచ్చితంగా కాలేదు. కలెక్షన్ల పరంగా కూడా కాంతార మార్క్ ని ఈ సినిమా టచ్ చేయడం అసాధ్యమనే చెప్పాలి. ఈ సినిమాకు రిపీట్ ఆడియన్స్ ఉండరు కానీ కాంతార కు రిపీట్ ఆడియన్స్ భారీగా వచ్చారు. కాకపోతే 2018 డబ్బింగ్ సినిమాల్లో మంచి పేరు తెచ్చే సినిమాల లిస్ట్ లో కచ్ఛితంగా ఉంటుంది.













