‘118’ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ విడుదల
నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ `118`. నివేదా థామస్, షాలిని పాండే హీరోయిన్స్‌గా నటించగా, ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి.గుహన్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేష్ ఎస్ కోనేరు నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర స్వరాలు సమకూరుస్తున్నారు. మార్చి 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఎవరో తెలియని శత్రువు కోసం చేసే పోరాటంగా ట్రైలర్ సాగుతుంది. ప్రతి విషయంపై క్లారిటీతో పనిచేసే వ్యక్తి.. తెలియని వ్యక్తికోసం పోరాటం చేయడం సినిమా కథ గా తెలుస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.













