అమెరికా – భారత్ వాణిజ్య బంధం మరింత బలోపేతం..!
భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం మరింతగా బలోపేతమవుతోంది. ముఖ్యంగా ట్రంప్ సర్కార్ టారిఫ్ వార్ కారణంగా కాస్త పట్టాలుతప్పిన వాణిజ్య బంధాన్ని ముడివేసేందుకు ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అదే సమయంలో తమ దేశానికి తగిన ప్రయోజనం సమకూరడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నాయి. అయితే చాలా అంశాల్లో ఇరుదేశాలు ఒప్పందాలు చేసుకున్నప్పటికీ.. అన్నింటికన్నా కీలకమైన పోటీతత్వంలో అవసరమైన టారిఫ్ లపై మాత్రం ఒప్పందం జరగలేదు.
భారత్-అమెరికా (ఇండియా-యుఎస్) దౌత్య , వాణిజ్య చర్చల ఫలితంగా రక్షణ, సాంకేతికత (టెక్నాలజీ) మరియు ఇంధన రంగాలలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒప్పందాలు కుదిరాయి. సాంప్రదాయక కొనుగోలుదారు-విక్రేత సంబంధం నుంచి ఇరు దేశాలు కలిసి వస్తువులను ఉత్పత్తి చేసే స్థాయికి ఈ ఒప్పందాలు సహాయపడ్డాయి.ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరిన ప్రధాన రంగాలు మరియు వాటి విశేషాలను పరిశీలిద్దాం..
సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం’
భారత్-అమెరికా (ఇండియా-యుఎస్) ద్వైపాక్షిక సంబంధాలలో అత్యంత కీలకమైనది ‘సమగ్ర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం’ , వ్యూహాత్మక రక్షణ, సాంకేతిక ఒప్పందాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంయుక్త చొరవతో ఇరు దేశాల మధ్య ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసేందుకు ఈ ఒప్పందాలు దోహదపడుతున్నాయి.
1. మధ్యంతర వాణిజ్య ఒప్పందం
అమెరికా నుండి దిగుమతి అయ్యే పారిశ్రామిక వస్తువులు, పండ్లు, నట్స్ (మధ్యం, సోయాబీన్ ఆయిల్ వంటివి)పై భారత్ సుంకాలను గణనీయంగా తగ్గించడానికి లేదా తొలగించడానికి అంగీకరించింది. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వి500 బిలియన్లకు చేర్చడమే లక్ష్యంగా ‘మిషన్ 500’ ని ప్రకటించారు. అమెరికా నుండి భారత్ దాదాపు వి500 బిలియన్ల విలువైన ఎనర్జీ (ముడి చమురు, బొగ్గు), ఐసీటీ ఉత్పత్తులను కొనుగోలు చేయడానికి భారత్ సుముఖత వ్యక్తం చేసింది. అమెరికా నుండి చమురు దిగుమతులు పెంచడం ద్వారా రష్యాపై ఆధారపడటాన్ని తగ్గించే వ్యూహం కూడా ఇందులో భాగంగా ఉంది.
ఇవి కూడా చదవండి
2. కీలక ఖనిజాల ఒప్పందం:
క్వాడ్ (Quad) విదేశాంగ మంత్రుల సదస్సులో భాగంగా భారత్, అమెరికా దేశాలు అరుదైన మరియు అత్యంత కీలకమైన ఖనిజాల (Critical Minerals) సరఫరాపై ప్రత్యేక ఒప్పందం చేసుకున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఈవీ బ్యాటరీలకు అవసరమయ్యే అరుదైన ఖనిజాల కోసం చైనాపై ఆధారపడటాన్ని తగ్గించి, సురక్షితమైన సప్లై చైన్‌ను నిర్మించడం దీని ముఖ్య ఉద్దేశం.
3. వ్యూహాత్మక, సాంకేతిక సహకారం
ఇరు దేశాలు ఇప్పటికే ప్రాథమిక రక్షణ ఒప్పందాలైన GSOMIA, LEMOA, COMCASA మరియు BECA లపై సంతకాలు చేశాయి, ఇవి సైనిక సమాచార మార్పిడి¿, రక్షణ లాజిస్టిక్స్‌కు ఎంతగానో సహకరిస్తాయి. కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్లు, డిజిటల్ వాణిజ్యం మరియు అధునాతన సాంకేతిక రంగాలలో సంయుక్త పరిశోధనలను విస్తరించనున్నారు.
4. సుంకాల పోటీ
ఇతర పోటీ దేశాల కంటే భారతీయ ఎగుమతిదారులకు అమెరికా మార్కెట్లో తులనాత్మక ప్రయోజనం (్పుశీఎజూవtఱtఱఙవ Adఙaఅtaస్త్రవ) లభించే వరకు పూర్తి స్థాయి ఒప్పందం అమలుపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. భారత్ తన వస్తువులపై అమెరికా సుంకాలను 50% నుండి 18%కి తగ్గించాలని కోరుతోంది. భారతదేశం తన అంతర్గత వ్యవసాయ, డైరీ (పాడిపరిశ్రమ) రంగాలను అమెరికా దిగుమతులకు పూర్తిగా తెరవడానికి సాంస్కృతిక మరియు ఆర్థిక కారణాల వల్ల కొంత విముఖత చూపుతోంది, ఇది చర్చల ఆలస్యానికి ఒక కారణంగా నిలిచింది.
డీల్ మనకూ ఆకర్షణీయమే…
క్యాపిటల్ ఫ్రాంటియర్స్‌లో ప్రసంగించిన కేంద్రమంత్రి గోయల్.. అమెరికా అంతర్జాతీయ అత్యవసర ఆర్ధిక అధికార చట్టం కింద టారిఫ్ లు విధించినప్పుడు… అది భారత దేశాన్ని 50 శాతం టారిఫ్ రీజీమ్ లో ఉంచిందని. గుర్తు చేశారు. ఆ డీల్‌లో మనకు దక్కిన ఆ 18 శాతం ప్రయోజనం చాలా ఆకర్షణయమన్నారు గోయల్. మన పొరుగువారితో మరియు ఇతర పోటీ దేశాలతో పోలిస్తే, మన డీలే అతి ఆకర్షణీయంగా మారింది. సింగపూర్‌ను మినహా ఆసియా దేశాలలో కూడా మన తక్కువ విలువలు ఉన్నాయి. ఆ కారణంగా డీల్ మనకూ ఆకర్షణీయంగా ఉందన్నారు.
అమెరికా ట్రేడ్ ప్రతినిధి జేమిసన్ గ్రీర్, న్యూఢిల్లీలో కేంద్రమంత్రి గోయల్, ఉన్నత వాణిజ్య మంత్రిత్వ శాఖ నిపుణులతో భేటీ అయి, ప్రతిపాదిత ద్విపక్ష వాణిజ్య ఒప్పందం మొదటి దశ ఫ్రేమ్‌వర్క్‌కు తుది రూపం ఇవ్వడానికి చర్చలు జరిపారు. మొదటి వాణిజ్య చర్చల స్థాయి సమావేశాల తర్వాత రెండు వైపుల నుంచి ప్రకటన వచ్చింది. మరో ఆసక్తికరమైన విషయం అమెరికా సుప్రీంకోర్టు.. ట్రంప్ సర్కార్ విధించిన టారిఫ్‌లను కొట్టివేయడంతో.. ఆ ఒప్పందాలకు సరైన విలువ ఉండే అవకాశం లేదు. దీనికి తోడు పదిశాతం టారిఫ్‌లు కూడాా అమలు కావాలను కున్నా దానికి తగిన కారణముండాలన్నది భారత్ భావనగా కనిపిస్తోంది. అమెరికా 2025-26లో భారతదేశానికి రెండవ అతిపెద్ద వ్యాపార భాగస్వామి. ఆ ఆర్థిక సంవత్సరంలో USకి భారతదేశపు ఎగుమతులు USణ 87.3 బిలియన్లు ఉండగా, దిగుమతుల విలువ USణ 52.9 బిలియన్లు.
రక్షణ రంగం
10 ఏళ్ల రక్షణ ఫ్రేమ్‌వర్క్ (2025-2035): ఇరు దేశాల మధ్య రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేస్తూ సరికొత్తగా పదేళ్ల రక్షణ కార్యాచరణ ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా ఇరుదేశాలు సంయుక్తంగా ఆయుధాలను ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి. జావెలిన్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైల్స్ వంటి ఆధునిక ఆయుధాలను భారత్‌లోనే సంయుక్తంగా తయారు చేయడానికి అంగీకారం కుదిరింది.
1. మిలిటరీ సపోర్ట్:
భారత సైన్యంలో ఉన్న అపాచీ హెలికాప్టర్లు, వీ777 హోవిట్జర్ గన్ల నిర్వహణ, సాంకేతిక సహాయం కోసం అమెరికా సుమారు వి482 మిలియన్ల సపోర్ట్ ప్యాకేజీని ఆమోదించింది. అత్యవసర సమయాల్లో ఇరు దేశాల సైన్యాలకు అవసరమైన పారిశ్రామిక వనరులను పరస్పరం ప్రాధాన్యతపై సరఫరా చేసుకునేందుకు వీలుగా ‘సెక్యూరిటీ ఆఫ్ సప్లై అరేంజ్మెంట’ (SOSA) పై సంతకాలు జరిగాయి. వ్యూహాత్మక సమాచార మార్పిడిని పెంచడానికి ఫ్లోరిడాలోని అమెరికా స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ హెడ్‌క్వార్టర్స్‌లో భారత సైనిక అధికారిని నియమించేందుకు మొట్టమొదటిసారిగా అంగీకారం కుదిరింది.
2. ట్రస్ట్ ఇనిషియేటివ్:
గతంలో ఉన్న ఐసీఈటీని మార్చి, ట్రాన్స్ఫార్మింగ్ ది రిలేషన్షిప్ యుటిలైజింగ్ స్ట్రాటజిక్ టెక్నాలజీ పేరిట సరికొత్త కూటమిని ఏర్పాటు చేశారు. భవిష్యత్తు సాంకేతికతలైన కృత్రిమ మేధస్సు, క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్ల తయారీ మరియు బయోటెక్నాలజీ రంగాలలో అమెరికా సాంకేతికతను భారత్‌కు బదిలీ చేసేందుకు అంగీకారం కుదిరింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి అమెరికన్ టెక్ దిగ్గజాలు భారత్‌లో డిజిటల్ మౌలిక సదుపాయాలు మరియు భారీ డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రత్యేక పన్ను మినహాయింపులు కల్పించారు.
3. ఇంధన భద్రత
భారతదేశ ఇంధన అవసరాల కోసం అమెరికా నుండి క్లీన్ ఎనర్జీ, ఎలఎన్జీ (LNG), ముడి చమురు మరియు బొగ్గు కొనుగోళ్లను భారీగా పెంచడానికి ఒప్పందం కుదిరింది. అమెరికాకు చెందిన కంపెనీలు భారత అణు విద్యుత్ రంగంలో భాగస్వాములు కావడానికి ఉన్న చట్టపరమైన అడ్డంకులను తొలగించారు.
4. క్రిటికల్ మినరల్స్ కోఆపరేషన్:
ఎలక్ట్రానిక్స్, ఈవీ బ్యాటరీల తయారీకి అత్యంత అవసరమైన లిథియం, కోబాల్ట్ వంటి అరుదైన ఖనిజాల సరఫరా గొలుసుపై ప్రత్యేక ద్వైపాక్షిక వ్యూహాత్మక ఒప్పందం కుదిరింది. దీని ద్వారా చైనా ఏకఛత్రాధిపత్యానికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
5. భారత ఎగుమతులకు ఊరట:
అమెరికా సుంకాలను తగ్గించిన జాబితాలో ఉన్న భారతీయ ఫార్మాస్యూటికల్స్ (జెనరిక్ మందులు), రత్నాలు-వజ్రాలు, ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాలకు అమెరికా మార్కెట్లో మంచి ప్రాధాన్యత లభించింది. అమెరికా నుండి వచ్చే కొన్ని రకాల పారిశ్రామిక వస్తువులు, పండ్లు (బాదం, యాపిల్స్ వంటివి), వైన్ మరియు సోయాబీన్ ఆయిల్‌లపై భారత్ దిగుమతి పన్నులను తగ్గించడానికి అంగీకరించింది.








