వంద ఉద్యోగాలకు Apply చేసినా ఒక్క Call లేదా? దాని వెనక దాగి ఉన్న షాకింగ్ నిజం ఇదే!
సూర్య ప్రకాష్ జోశ్యుల..
AI Recruitment: ఉదయం లేవగానే… LinkedIn ఓపెన్ చేస్తారు… Naukriలో కొత్త Jobs చూస్తారు… మళ్లీ ఇంకో Resume పంపిస్తారు… సాయంత్రానికి… “Application Submitted” అనే మెసేజ్ తప్ప… మరో సమాధానం ఉండదు. వంద ఉద్యోగాలకు Apply చేసినా… ఒక్క Interview Call కూడా రావట్లేదు. వారం… నెల… కొన్నిసార్లు ఏడాది కూడా గడిచిపోతుంది. అప్పుడు ఇంట్లో ఒకటే ప్రశ్న… “ఇంకా ఉద్యోగం రాలేదా?”,. బయట వాళ్లు అడిగేది అదే… లోపల మనసు అడిగేది కూడా అదే… “నాలోనే ఏదైనా లోపమా?, ఎందుకిలా జరుగుతోంది” అప్పుడు మీరు అనుకునేది ఒక్కటే… “నా Resumeలో ఏదో తేడా ఉంది” అని. కానీ…నిజానికి మీ Resumeలో లోపం లేకపోవచ్చు… అది ఎవరి చేతుల్లో పడుతుందో… అదే అసలు సమస్య కావచ్చు. ఎందుకంటే… ఉద్యోగం కోసం మీరు పంపిన Resume… HR టేబుల్‌పై పడకముందే… ఎవరో ఒకరు చూసి… “ఇతనికి అవకాశం ఇవ్వొద్దు” అని నిర్ణయిస్తున్నారు!
ఆ “ఎవరో” ఎవరు?
ఆ వ్యక్తి… HR కాదు… Recruiter కాదు… మీకోసం ఎదురుచూస్తున్న కంపెనీ కూడా కాదు… అది… AI! ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని కంపెనీల్లో… మీ Resumeను ముందుగా చదివేది… మీకు Interview రావాలా వద్దా అని నిర్ణయించేది… మీరు Shortlist అవుతారా లేదా అని తేల్చేది… ఒక మనిషి కాదు. ఒక సాఫ్ట్వేర్.
ఇది ఊహ కాదు…
ఇటీవల ముంబైలో జరిగిన ఒక భారీ AI Job Fairలో… 300 ఉద్యోగాల కోసం 25,000 మంది అప్లై చేశారు. వేలాది Resumeలను ఒక్క HR కూడా చూడలేదు. అయినా… కొద్ది రోజుల్లోనే ఉద్యోగాలకు ఎంపిక పూర్తయింది. అది ఎలా సాధ్యమైంది? ఇక్కడే ఉద్యోగాల ప్రపంచంలో అసలు మార్పు మొదలైంది… ఇంతకుముందు… ఉద్యోగానికి దరఖాస్తు చేస్తే… HR మీ Resume చూసేవారు. తర్వాత Interview. ఆ తర్వాతే ఎంపిక. కానీ ఇప్పుడు ఆ క్రమమే మారిపోతోంది. మీ Resume కంపెనీకి చేరిన వెంటనే… ముందుగా దాన్ని పరిశీలించేది మనిషి కాదు… Artificial Intelligence (AI).
మీ Skills…
మీ Experience…
మీ Resumeలో ఉన్న Keywords… ఉద్యోగానికి సరిపోతాయా లేదా… అని కొన్ని సెకన్లలోనే విశ్లేషిస్తుంది. అక్కడ మంచి స్కోర్ వస్తేనే… మీ Resume HR టేబుల్ వరకు చేరుతుంది. ముంబైలో జరిగిన ఈ ప్రయోగం అదే విషయాన్ని నిరూపించింది. ఈ AI Job Fairలో… ఒకేసారి 5 వేల మందికి పైగా అభ్యర్థులు AI ఆధారిత Video Interviewలో పాల్గొన్నారు. వాళ్లు చెప్పిన ప్రతి సమాధానాన్ని AI విశ్లేషించింది. తర్వాత స్కోర్ ఇచ్చింది. ఆ స్కోర్ల ఆధారంగా వేలాది మంది అభ్యర్థులను కొద్ది మందికి కుదించి… చివర్లో మాత్రమే HR టీమ్‌కు పంపించింది. అంటే… ఇక్కడ AI ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ… ఉద్యోగానికి ఎవరు చివరి దశ వరకు వెళ్లాలో మాత్రం AIనే నిర్ణయించింది.
ఎలాన్ మస్క్ చెప్పిన మాట గుర్తు చేసుకోండి:
“AI will be the best or worst thing ever for humanity.”
ఇక్కడ చూస్తే… ఇది కంపెనీలకు మాత్రం “best thing” అయిపోయింది. 50 రెట్లు వేగంగా… 10 రెట్లు చౌకగా! ఈ AI Hiringలో అసలు షాక్ ఇదే.
సాధారణంగా ఒక ఉద్యోగిని నియమించాలంటే…
ఒక నెల జీతం వరకు ఖర్చు అవుతుంది. కానీ ఇక్కడ… ప్రతి నియామకానికి కేవలం రూ.10,000 మాత్రమే! “తక్కువ ఖర్చుతో ఎక్కువ పని” ఇదే కంపెనీల లక్ష్యం. AI దాన్ని నిజం చేసింది.
ఇకపై మీ Resume నిజంగా HR దగ్గరకు వెళ్తుందా?
ఇప్పుడు అసలు ప్రశ్న ఇదే. “నేను పంపిన Resumeను నిజంగా ఎవరు చూస్తున్నారు?” సమాధానం సింపుల్… ముందుగా AI చూస్తోంది. మీ Resumeలో ఉన్న… Keywords, Skills, Experience, Qualification అన్నింటినీ కొన్ని సెకన్లలో విశ్లేషిస్తుంది. స్కోర్ ఇస్తుంది. ఆ స్కోర్ బాగుంటేనే… మీ Resume HR టేబుల్ వరకు చేరుతుంది. లేకపోతే… “చూసినట్టే చూడకుండా” Reject అవుతుంది. ఈ క్రమంలో ATS గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
ATS అంటే ఏమిటి? ఎందుకు చాలామంది Resumeలు Reject అవుతున్నాయి?
ATS (Applicant Tracking System)… ఇది కంపెనీలకు ఒక ఫిల్టర్ లాంటిది. ఇది చూసేది: సరైన Keywords ఉన్నాయా? Skills మ్యాచ్ అవుతున్నాయా? Format సరిగ్గా ఉందా?. “విత్తిన దాన్నే కోస్తారు” అన్నట్టు… మీ Resumeలో ఏమి పెడతారో… అదే మీ ఫలితం.
మరి AI చూసే Resume ఎలా ఉండాలి?
ఇప్పుడు Resume కూడా “స్మార్ట్” కావాలి.
PDF Formatలో పంపండి
సరైన Keywords వాడండి
క్లిష్టమైన డిజైన్ తగ్గించండి
Skills స్పష్టంగా చూపించండి
“సరైన తాళం లేకపోతే తలుపు తెరుచుకోదు” అలాగే… సరైన Resume లేకపోతే… Interview తలుపు తెరుచుకోదు.
AI Video Interviewలో ఎలా గెలవాలి?
AI మీ మాటలు మాత్రమే కాదు… మీ ప్రవర్తన కూడా చూస్తుంది. కెమెరా వైపు చూడండి. స్పష్టంగా మాట్లాడండి
ఉదాహరణలు ఇవ్వండి. ఆత్మవిశ్వాసం చూపండి. Background neatగా ఉంచండి.AI వల్ల ఉద్యోగాలు పోతున్నాయా?ఉద్యోగాల భవిష్యత్తు మారిపోయిందా? ఈ ప్రశ్న అందరికీ ఉంటుంది. Quantiphi సహ వ్యవస్థాపకుడు వివేక్ ఖేమాని ఇలా చెప్పారు: “ఉద్యోగాలు పోవడం కాదు… ఉద్యోగాల స్వభావం మారుతోంది.” ఇది నిజం.
ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉన్న ఉద్యోగాలు:
AI Engineer
Machine Learning Engineer
Data Scientist
ఇవి ఐదేళ్ల క్రితం పెద్దగా వినిపించలేదు.
ఏదైమైనా…
ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. AI ఉద్యోగాలను తీసేయడం కాదు… ఉద్యోగాలు ఇచ్చే విధానాన్ని మార్చేస్తోంది. ఇకపై… చదువు మాత్రమే కాదు… Resume ఎలా తయారు చేయాలి?AI ఎలా పనిచేస్తుంది?
Interview ఎలా ఎదుర్కోవాలి? ఇవి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే… “కాలానికి తగ్గట్టు మారని వాడు… కాలానికి దూరమవుతాడు.” ఇకపై… మీ ఉద్యోగాన్ని నిర్ణయించేది… కేవలం HR కాదు… AI కూడా! అని మర్చిపోకండి.








