అమెరికా స్వాతంత్య్రానికి 250 సంవత్సరాలు.. ఎన్ఆర్ఐలు చేస్తున్న వేడుకలు
మామూలుగానే ప్రతి సంవత్సరం జులై 4 అనగానే అమెరికాలో అందరికి పండుగే! ఈ దేశం లో ఇండిపెండేన్స్ డేని అందరూ శ్రద్దగా జరుపుకుంటారు. మన భారత దేశస్తులు కూడా ఆ వారంలో ((long weakend) తెలుగు మహా సభలు అలాగే కన్నడ, గుజరాతీ మహాసభలు చేసుకుంటారు. 2026 సంవత్సరం అమెరికా చరిత్రలో ఒక విశిష్టమైన మైలురాయి. అమెరికా స్వాతంత్య్ర ప్రకటనకు 250 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భాన్ని దేశవ్యాప్తంగా America250 పేరుతో ఘనంగా జరుపుకుంటున్నారు. మన తెలుగు వాళ్ళు చేసే సభలలో కూడా జులై 4వ తేదీన అమెరికా స్వాతంత్ర దినోత్సవం గుర్తు చేసుకుంటూ ఒక కార్య క్రమం చేస్తారు.
భారతీయ అమెరికన్ల (Indian Ameicans) విజయగాథ అమెరికన్ డ్రీమ్‌కు ప్రతీక. అనేక మంది భారతీయులు ప్రముఖ టెక్నాలజీ సంస్థల్లో నాయకత్వ స్థానాల్లో ఉన్నారు. వైద్యులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు, సేవా కార్యకర్తలుగా వారు అమెరికా అభివృద్ధిలో భాగస్వాములు అవుతున్నారు.
దాదాపు ప్రతి నగరంలోను 15 ఆగష్టున జరిగే ఇండియా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఈ సారి ‘ఇండియా 80-అమెరికా 250’గా చేసుకోవడానికి ప్రయత్నాలు ఇప్పటికే మొదలు అయ్యాయి. ఫెడరేషన్ అఫ్ ఇండియానస్సోసియేషన్స్ – చికాగో (FIA-Chicago) జూన్ 26వ తేదీన అమెరికా 250 సందర్భంగా పెద్ద ఎత్తున కమ్యూనిటీ డిన్నర్ కార్యక్రమాలు నివహించింది. తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ అమెరికా (TANA) – చార్లెట్ నగర విభాగం జులై 18న పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ కాంప్ నిర్వహణ కు ముందుకు వచ్చారు ఫౌండేషన్ అఫ్ ఇండియన్ అమెరికన్స్ – న్యూ ఇంగ్లాండ్ విభాగం వారు అమెరికా 250 సందర్భంగా 250 మొక్కలు అయితే కార్యక్రమానికి శ్వీకారం చుట్టారు.
America250 వేడుకలు యువతకు ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నాయి. స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం, సేవా భావం వంటి విలువలను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని ఈ సందర్భం గుర్తు చేస్తోంది. భారతీయ మూలాలను మరచిపోకుండా, అమెరికన్ సమాజంలో చురుకైన పాత్ర పోషించడం ఎనఆరఐ సమాజం ప్రత్యేకత.ఈ వేడుకలు కేవలం గతాన్ని స్మరించుకోవడమే కాదు. భవిష్యత్తును మరింత బలంగా, సమానంగా, సృజనాత్మకంగా నిర్మించాలనే పిలుపు కూడా.
అమెరికా 250వ స్వాతంత్య్ర వార్షికోత్సవానికి శుభాకాంక్షలు!








