‘బయోకాన్’ కొత్త బాస్ ఆమెనే.. వారసురాలిని ప్రకటించిన కిరణ్ మజుందార్ షా!
భారతదేశ బయోటెక్నాలజీ రంగంలో రారాజుగా వెలుగొందుతున్న దిగ్గజ ఫార్మా సంస్థ ‘బయోకాన్‘ (Biocon) భవిష్యత్ నాయకత్వంపై ఎట్టకేలకు ఒక స్పష్టత వచ్చింది. నాలుగు దశాబ్దాలుగా సంస్థను ఒంటిచేత్తో నడిపించి, ప్రపంచ స్థాయికి చేర్చిన బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా (Kiran Mazumdar-Shaw) తన వ్యాపార వారసత్వాన్ని ఎవరికి అప్పగించబోతున్నారన్న ఆసక్తికర ప్రశ్నకు తెరదించారు. తన వేల కోట్ల సామ్రాజ్యానికి తదుపరి నాయకురాలిగా తన మేనకోడలు క్లెయిర్ మజుందార్ (Claire Mazumdar)ను ఎంపిక చేసినట్లు ఆమె అధికారికంగా ప్రకటించారు.
ఇవి కూడా చదవండి
వెంటనే తప్పుకోవట్లేదు.. కానీ..
ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ‘ఫార్చూన్ ఇండియా’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కిరణ్ మజుందార్ ఈ సంచలన విషయాలను పంచుకున్నారు. బయోకాన్ (Biocon) భవిష్యత్తును మరింత ముందుకు తీసుకెళ్లే బృహత్తర బాధ్యతలను క్లెయిర్ మజుందార్‌కు అప్పగిస్తానని స్పష్టం చేశారు. అయితే తాను ఇప్పటికిప్పుడు సంస్థ బాధ్యతల నుంచి తప్పుకోవడం లేదని, సడన్‌గా ఎలాంటి మార్పులు ఉండవని క్లారిటీ ఇచ్చారు. సరైన సమయం వచ్చినప్పుడు మాత్రమే, ఒక పద్ధతి ప్రకారం దశలవారీగా ఈ బాధ్యతల బదిలీ జరుగుతుందని ఆమె వెల్లడించారు. సంస్థను అంతర్జాతీయ స్థాయిలో మరింత సమర్థవంతంగా నడిపించే పూర్తి సత్తా, విజన్ క్లెయిర్‌కు ఉన్నాయని కిరణ్ మజుందార్ గట్టి విశ్వాసం వ్యక్తం చేశారు.
ఎవరీ క్లెయిర్ మజుందార్?
క్లెయిర్ మజుందార్ కేవలం కిరణ్ మజుందార్ షాకు మేనకోడలు మాత్రమే కాదు, బయోటెక్ (Biocon) రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఫైర్‌బ్రాండ్. ప్రస్తుతం ఆమె ‘బికారా థెరప్యూటిక్స్’ (Bicara Therapeutics) అనే సంస్థకు సీఈఓ (CEO)గా వ్యవహరిస్తున్నారు. క్యాన్సర్ చికిత్సకు సంబంధించి సరికొత్త థెరపీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 2018లో క్లెయిర్ ఈ సంస్థను స్వయంగా స్థాపించారు. విశేషమేమిటంటే, ఈ స్టార్టప్‌కు బయోకాన్ (Biocon) సంస్థ ఇంక్యుబేషన్ సపోర్ట్ అందించింది. బైస్పెసిఫిక్ యాంటీబాడీల వంటి అత్యంత ఆధునిక, అభివృద్ధి చెందుతున్న థెరపీలపై ప్రధానంగా దృష్టి సారించిన బికారా థెరప్యూటిక్స్.. మార్కెట్లో అనూహ్య వృద్ధి సాధించింది. ఎంతలా అంటే, 2024లో ఈ సంస్థ ప్రతిష్టాత్మక నాస్డాక్ (NASDAQ) స్టాక్ ఎక్స్ఛేంజీలో సైతం లిస్ట్ అయి గ్లోబల్ బయోటెక్ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇలాంటి సక్సెస్ ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉన్న క్లెయిర్ చేతికి బయోకాన్ పగ్గాలు వెళ్లడం సంస్థకు మరింత లాభదాయకమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
గ్యారేజీ నుంచి గ్లోబల్ స్థాయికి..
1978లో బెంగళూరులోని ఒక చిన్న గ్యారేజీలో కిరణ్ మజుందార్ షా అత్యంత నిరాడంబరంగా బయోకాన్‌ను (Biocon) ప్రారంభించారు. తన పట్టుదల, కఠోర శ్రమతో నాలుగు దశాబ్దాల కాలంలో దానిని భారతదేశపు అగ్రశ్రేణి బయోటెక్ కంపెనీలలో ఒకటిగా నిలబెట్టారు. ఇప్పుడు ఆ సంస్థ గ్లోబల్ మార్కెట్లలో మరింతగా విస్తరించే దశలోకి అడుగుపెడుతున్న కీలక సమయంలో.. తదుపరి తరం యువ నాయకత్వానికి పగ్గాలు అప్పగించే దిశగా కిరణ్ మజుందార్ వేస్తున్న ఈ అడుగులు కార్పొరేట్ ప్రపంచంలో సర్వత్రా ఆసక్తి రేపుతున్నాయి.
ఇవి కూడా చదవండి








