అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి రేసులో వివేక్ ?
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వపు రేసు నుంచి వైదొలిగిన వివేక్ రామస్వామి ట్రంప్‌తో కలిసి న్యూహ్యాంప్‌షైర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతుండగా అక్కడి జనం వీపీ వీపీ (వైస్ ప్రెసిడెంట్) అని నినాదాలు చేశారు. ట్రంప్, వివేక్ వారిని చూసి చిరునవ్వులు చిందించారు. తాను గెలిస్తే ఉపాధ్యక్ష సహచరుడిగా ఉంటారని ట్రంప్ సూచన ప్రాయంగా వెల్లడించారు. అనంతరం ట్రంప్ మాట్లాడుతూ వివేక్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి అని, ఆయన చాలా కాలంపాటు రిపబ్లికన్ పార్టీతో కలిసి ముందుకు సాగాతారని ప్రకటించారు.






